Moviesవార్ 2 : స‌రికొత్త లుక్‌లో ఎన్టీఆర్‌... డైరెక్ట‌ర్ ఏం చేశాడో...

వార్ 2 : స‌రికొత్త లుక్‌లో ఎన్టీఆర్‌… డైరెక్ట‌ర్ ఏం చేశాడో చూడండి…!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్‌, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇపుడు చేస్తున్న పలు సినిమాలలో ఎన్టీఆర్ నుంచి మొద‌ట‌గా రిలీజ్ అయ్యే సినిమా వార్ 2. బాలీవుడ్ సీనియ‌ర్ హీరో హృతిక్ రోష‌న్‌తో క‌లిసి ఎన్టీఆర్ న‌టిస్తోన్న ఈ సినిమా ఆగ‌స్టు 14న పాన్ ఇండియా రేంజ్‌లో ప‌లు భాష‌ల‌లో విడుద‌ల అవుతోంది. బాలీవుడ్‌ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ స్టన్నింగ్ యాక్షన్ డ్రామా నుంచి ఎన్టీఆర్ బ‌ర్త్ డే కానుక‌గా వ‌చ్చిన టీజ‌ర్ స్టైలీష్ యాక్ష‌న్‌తో అద‌ర‌గొట్టేసింది.War 2 Hrithik Roshan And Jr Ntr Starrer Film To Hit Cinemas On Republic ...ఇక తాజాగా ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ షేర్ చేసిన కొన్ని వ‌ర్కింగ్ స్టిల్స్ ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ మంచి డాషింగ్ లుక్ లో ఉన్నాడు. వార్ 2 సినిమాకి తన వర్క్ ఎక్స్ పీరియన్స్ ని కూడా అయాన్ పంచుకున్నాడు. వార్ 2 స్క్రిప్ట్ తనని ఎంతో కదిలించి నందునే తాను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాన‌ని తెలిపాడు. ఎన్టీఆర్, హృతిక్ ఇంకా కియారా అద్వానీలపై అయాన్ షేర్ చేసిన పిక్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

Latest news