Moviesచిరంజీవి - ప్ర‌భాస్ ఈ మౌనం ఎందుకు... ఇలా చేస్తున్నారేంటి..?

చిరంజీవి – ప్ర‌భాస్ ఈ మౌనం ఎందుకు… ఇలా చేస్తున్నారేంటి..?

టాలీవుడ్‌లో ఈ ఏడాదిలో ఇప్ప‌టికే రిలీజ్ కావాల్సిన భారీ సినిమాల‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ఈ స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కావాల్సి ఉంది. అస‌లు ఎప్పుడో మొద‌లైన ఈ రెండు సినిమాల‌పై స‌రైన క్లారిటీ లేక చిరు, ప్ర‌భాస్ అభిమానులే బిగ్ క‌న్‌ఫ్యూజ్‌లో ఉన్నారు. విశ్వంభ‌ర టీజ‌ర్ ఎప్పుడో వ‌చ్చింది. అందులో విజువల్స్ చూసి మెగాఫ్యాన్స్ త‌ల‌లు ప‌ట్టుకున్నారు.Vishwambhara: ఆ ప్రపోజల్‌కు ఒప్పుకోని చిరంజీవి.. 'విశ్వంభర' రిలీజ్  ఎప్పుడంటే?ఇక సినిమా సంక్రాంతి అన్నారు… స‌మ్మ‌ర్ అన్నారు.. ఇప్పుడు ఎప్పుడు వ‌స్తుందో తెలియ‌ట్లేదు. రాజాసాబ్ నుంచి టీజ‌ర్ కూడా లేదు. ఏ అప్‌డేట్ రావ‌డం లేదు. మ‌రోవైపు వీటితో డిలే అవుతూ వ‌చ్చిన ప‌వ‌న్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా ఫుల్ స్వింగ్‌లో ఉంది. అయితే విశ్వంభర, రాజా సాబ్ సినిమాలపై రిలీజ్ క్లారిటీ ఫ్యాన్స్ కోరుకుంటున్నా స‌స్పెన్స్‌గా ఉంచుతున్నారు. అందుకే ఈ సినిమాపై పెద్ద హైప్ కూడా లేకుండా పోయింది. చిరు, ప్ర‌భాస్ అయినా కాస్త చొర‌వ తీసుకుంటేనే ఈ సినిమాకు హైప్ వ‌స్తుంద‌ని ఫ్యాన్స్ చ‌ర్చించుకుంటున్నారు.

Latest news