MoviesTL రివ్యూ: అనగనగా సినిమా .. చాలా కాలం గుర్తుండి పోతుంది..!

TL రివ్యూ: అనగనగా సినిమా .. చాలా కాలం గుర్తుండి పోతుంది..!

విడుదల తేదీ: మే 15, 2025
ప్లాట్‌ఫాం: ETV విన్
తారాగణం: సుమంత్, కాజల్ చౌదరి, గడ్డం రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ అవసరాల
జానర్: ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్
దర్శకుడు: సన్నీ సంజయ్

✒️ కథాంశం:
__
“అనగనగా” ఒక హృదయాన్ని స్పర్శించే కుటుంబ కథ. ఇది తండ్రి-కొడుకుల బంధం చుట్టూ తిరుగుతూ, విద్యా వ్యవస్థలోని లోపాలను చర్చిస్తుంది. సుమంత్ ఒక స్కూల్ టీచర్ పాత్రలో కనిపిస్తారు. అతని పాత్ర నీతి, విలువలు, జీవితంలో నిజమైన విజయం అంటే అని మనచేత ఆలోచింపజేస్తుంది. ఈ చిత్రం నాస్టాల్జియా, భావోద్వేగాలు, మరియు జీవిత పాఠాలను అద్భుతంగా కలిపి వడ్డిస్తుంది.Anaganaga movie : ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా ''అనగనగా''.. ఒక మంచి  ఎమోషనల్‌ డ్రామా..!!

🎥 కథ :
వ్యాస్ (సుమంత్) ఒక కార్పొరేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తాడు. అతని భార్య భాగ్యలక్ష్మి (కాజల్ చౌదరి) అదే స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తుంది. వారి కుమారుడు రామ్ (మాస్టర్ విహర్ష్). వ్యాస్ తన విద్యార్థులకు పాఠాలను కథల రూపంలో బోధిస్తాడు, ఇది విద్యార్థులకు సులభంగా అర్థమవుతుందని అతని నమ్మకం. కానీ, స్కూల్ యాజమాన్యం అతని బోధనా విధానాన్ని వ్యతిరేకిస్తుంది. ఇదిలా ఉండగా, రామ్ చదువులో వెనుకబడి, తన తరగతిలో చివరి ర్యాంకు సాధిస్తాడు. ప్రిన్సిపాల్ కొడుకు చదువులో వెనుకబడటం భాగ్యలక్ష్మికి కొత్త తలనొప్పిగా మారుతుంది. స్కూల్ యాజమాన్యం ఆమెను ప్రశ్నిస్తుంది, దీంతో భాగ్యలక్ష్మి రామ్‌పై ఒత్తిడి పెంచుతుంది.
వ్యవస్థను సవాలు చేస్తూ, వ్యాస్ తన సొంత బోధనా విధానం ఫలితాలను ఇవ్వగలదని నిరూపించడానికి సగటు విద్యార్థుల కోసం స్వంతంగా ఒక స్కూల్‌ను ప్రారంభిస్తాడు. ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. డైరెక్టర్ మనకంతా తెలుసు అనుకునేలోపు ఈ మలుపుతో మనల్ని సినిమాలో లీనం చేస్తాడు.. ఆ ట్విస్ట్ ఏంటి… అతని స్కూల్ ఏమైంది అనేది మిగతా కథ.మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి నేరుగా రానున్న తెలుగు సినిమా.. స్ట్రీమింగ్  ఎక్కడంటే.. ప్రీమియర్లకు సూపర్ రెస్పాన్స్-sumanth emotional family drama  movie ...🎞️ విశ్లేషణ:
తమిళంలో ఈ మధ్య సత్యం సుందరం అని అరవింద్ స్వామి, కార్తి కలిపి తీసిన సినిమా ఒకటి విడుదలైంది… అలాంటివి మన వాళ్లెందుకు తీయరు అనుకునే వారికి ఈ సినిమా ఒక సమాధానం అని చెప్పొచ్చు. సినిమా సాధారణ టెంప్లేట్‌తో నెమ్మదిగా ప్రారంభమవుతుంది. కార్పొరేట్ స్కూళ్ల గురించి ప్రతి తల్లిదండ్రికీ తెలిసిన విషయాలే ఉంటాయి కాబట్టి, సినిమా మొదటి భాగంలో ప్రేక్షకులకు కొత్తగా ఏమీ అనిపించదు. కొంచెం స్లోగా కూడా అనిపిస్తుంది. వ్యాస్ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి దర్శకుడు కొంత సమయం తీసుకుంటాడు. సినిమా ఏంటనేది ఫస్టాఫ్ లోనే మనకు తెలిసిపోతుంది. కానీ సెకండాఫ్ లో డైలాగులు, నటీనటుల ప్రతిభకు మనం ముగ్దులు అయిపోతాం. లోతైన భావోద్వేగ బంధాలు ఒక్కోసారి తెలియకుండా మనసు బరువెక్కేలా చేస్తాయి. ప్రేక్షకులు నెమ్మదిగా వ్యాస్ పాత్రను ఇష్టపడటం ప్రారంభిస్తారు. క్లైమాక్స్ సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి. కొందరికి ఏడుపు కూడా రావచ్చు. ఇక చిన్నారి నటన పీక్స్ లో ఉంటుంది. వాడెంత టాలెంటెడ్ నుటుడో లక్కీ భాస్కర్ లో చూశారు. కానీ ఇందులో ఆ చిన్నారి విశ్వరూపం చూస్తారు.సుమంత్ నటన మరియు సన్నీ సంజయ్ దర్శకత్వంతో వారు చెప్పాలనుకున్న విషయం నేరుగా మన గుండెల్లోకి చేరుతుంది. బాలక్రిష్ణ బాషలో చెప్పాలంటే… ఈ సినిమా మీకు చాలా కాలం గుర్తుంటుంది. విద్య, కుటుంబం, మరియు జీవిత విలువలపై ఆలోచింపజేసే ఈ చిత్రం విడుదలైన రోజే ఓటీటీలో నీరాజనాలు అందుకుంది అంటే… ఆ సినిమా ప్రేక్షకులకు ఎంత నచ్చిందో మీకు ఇట్టే తెలిసిపోతుంది. ETV win అనే ఒక ఓటీటీని ఎవరూ గుర్తించని సమయంలో 90’s A Middle Class Biopic అనే సినిమాతో ఈటీవీ విన్ నేను కూడా ఓటీటీ అని పరిచయం చేసుకుంది. కానీ తాజాగా అనగనగా సినిమాతో… ఈటీవీ విన్ ఎంపికకు చాలామంది సబ్ స్క్రైబర్లుగా మారిపోయేలా చేసిందంటే… ప్రేక్షకులకు అదెంత సమ్మోహనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.The Cult Cinema on X: "#Anaganaga తమిళ సత్యం సుందరం లాంటి సినిమా మన తెలుగు  వాళ్ళు ఎందుకు చేయరు అనిపించేది.. ఆ లోటు తీర్చేసింది @iSumanth లీడ్ రోల్ లో  నటించిన ...

🎭నటన:
సుమంత్ తన 26 ఏళ్ల కెరీర్‌లో (అవును సుమంత్ 26 ఏళ్ల నుంచి సినిమాల్లో ఉన్నాడు… ఈ తరానికి పెద్దగా తెలియదు). అతను ఒక ప్రతిభావంతమైన నటుడు అయినా… చాలామంది దర్శకులు అతని ప్రతిభను వాడుకోలేకపోయారు. కానీ తాజాగా ఈ సినిమాలో దర్శకుడు సన్నీ… సుమంత్ ఎంత గొప్ప నటుడో అందరికీ చూపించి ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమాతో సుమంత్ కొత్త తరానికి కొత్తగా పరిచయం అవుతాడు. అతని సహజమైన నటన, ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలలో, ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సోషల్ మీడియాలో అతని పాత్రను “క్లాసిక్ సుమంత్” అని ప్రశంసిస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ గా చేసిన కాజల్ చౌదరి, గడ్డం రాకేష్ రెడ్డి వంటి సహాయ నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు, అయితే సుమంత్‌దే హైలైట్. అవసరాల శ్రీనివాస్ ది కీలకపాత్రే గాని ప్రత్యేక పాత్ర కాదు.Anaganaga Early Reviews: Here's what netizens have to say about Sumanth's  family drama movie ahead of its digital debut | PINKVILLA🎬 దర్శకత్వం:
సన్నీ సంజయ్ సరళమైన, ఆత్మీయమైన కథనాన్ని అందించారు. విద్యా వ్యవస్థ పై విమర్శనాత్మక చర్చను సినిమాలో సహజంగా పొందుపరిచాడు, సినిమా మొత్తం సందేశం ఇస్తున్నా… మనకు ఎక్కడా క్లాస్ పీకిన ఫీలింగ్ కలగకుండా భావోద్వేగాలతో కవర్ చేశాడు. డాక్యుమెంటరీ వంటి కథను… పూర్తి స్థాయి సినిమాగా తీర్చిదిద్దినందుకు సన్నీకి అభినందనలు చెప్పాలి.
సినిమాటోగ్రఫీ సరళంగా ఉంటూ కథకు సరిపోయేలా ఉంది, గ్రామీణ నేపథ్యాన్ని అందంగా చూపించింది. సంగీతం కథనానికి బలం చేకూర్చింది, ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హృదయాన్ని తడిమేస్తుంది.anaganaga movie review: 'అనగనగా' మూవీ రివ్యూ, సుమంత్ కమ్‌బ్యాక్ ఇచ్చాడా.. |  Times Now Telugu👍 పాజిటివ్ అంశాలు:

సుమంత్ యొక్క నటనా విశ్వరూపం
విద్యా వ్యవస్థపై చర్చించిన తీరు
స్క్రీన్ ప్లే మరియు బలమైన క్లైమాక్స్

👎 నెగటివ్ అంశాలు:
కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించవచ్చు.
కొంతమంది సహాయ పాత్రలు మరింత లోతుగా రాసుంటే బాగుండేది.

🔴 తీర్పు :
తప్పకుండా చూడదగిన కుటుంబ కథా చిత్రం. పిల్లలున్న ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే సినిమా.

⭐ రేటింగ్: 3.25/5 ( ఫ్యామిలీ డ్రామాలు, భావోద్వేగ కథలు ఇష్టపడేవారు 4/5 రేటింగ్ ఇస్తారు. )

✒️🟢 ప్రకాష్ చిమ్మల వర్డ్ : ఈ సినిమా మీకు చాలా కాలం గుర్తుంటుంది.

Latest news