Moviesఅల్లు అర్జున్ - త్రివిక్ర‌మ్ మూవీపై క్లారిటీ ఇచ్చేశారుగా.. !

అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్ మూవీపై క్లారిటీ ఇచ్చేశారుగా.. !

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘ పుష్ప – 2 ’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా సాధించిన వ‌సూళ్ల దెబ్బ‌కు బన్నీ స్టామినా ఏమిటో దేశ వ్యాప్తంగా ఫ్రూవ్ అయ్యింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ, ప్రస్తుతం తన త‌ర్వాత సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, బన్నీతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గతంలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు.Julayi Movie Wallpapers, Posters & Stillsవీరి కాంబోలో జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, అల వైకుంఠ‌పురంలో సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు నాలుగో సినిమా అన‌గానే అంచ‌నాలు మామూలుగా లేవు. ఇక త‌న త‌ర్వాత సినిమా బ‌న్నీ తోనే ఉంటుంద‌ని ఇప్ప‌టికే క్లారిటీ కూడా ఇచ్చేశాడు త్రివిక్ర‌మ్‌. పుష్ప – 2 సినిమా తర్వాత ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. త్రివిక్రమ్ ఈ సారి చాలా బలమైన కథతో రాబోతున్నాడట‌.Ala Vaikuntapuramlo Telugu Movie Preview cinema review stills gallery  trailer video clips showtimes - IndiaGlitz.comగుంటూరు కారం అనుకున్న స్థాయిలో మెప్పించ‌లేదు. అందుకే ఈ సారి స్టోరీ రైటింగ్‌లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడ‌ని తెలుస్తోంది. దీంతో ఈ కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీతో బ‌న్నీ సినిమా ఉంటుంది.

Latest news