టాలీవుడ్లో మెగా బ్రాండ్ ఇమేజ్ క్రేజ్ తెలిసిందే. మెగా వారసత్వాన్ని కొనసాగించడం అంత సులభం కాదు. చాలా అంచనాలు ఉంటాయి. గట్టి పోటీ ఎదుర్కోవాలి. బ్రాండ్ ఇమేజ్ నిలబెట్టాలి. వరుణ్ తేజ్ సినిమా జర్నీ ముకుందతో స్టార్ట్ అయ్యింది. ఈ రోజుకు ఖచ్చితంగా పదేళ్లు సినిమా ప్రస్థానం పూర్తి చేసుకున్నాడు. ఈ పదేళ్లలో వరుణ్ తేజ్ కెరీర్ ఒడిదుడుకులతోనే నడుస్తోంది.
ఒక్కసారి వెనక్కు వెళితే ముకుంద, కంచె, ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2, ఎఫ్ 3, గద్దల కొండ గణేష్ ఇవన్నీ మరపురాని విజయాలే. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠితో రెండు సినిమాల్లో నటించాడు. రెండు పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఆమెనే ప్రేమించి తన జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. వరుణ్‌లో మంచి మాస్ అప్పీల్ ఉంది. కానీ సరైన కథలు ఎంచుకోక కెరీర్లో వెనకపడిపోయాడు.
వరుణ్ యాక్షన్ సినిమాలు చేసినప్పటి కంటే స్మూత్ కథలు చేస్తేనే ప్రేక్షకులు ఆదరించారు.
కొన్ని ప్రయోగాలు వరుణ్ ని బాగా దెబ్బకొట్టాయి. అంతరిక్షం, ఆపరేషన్ వాలైంటైన్ ఇలాంటివే. గతేడాది గని, మట్కా, గాంఢీవధారి అర్జున అన్నీ సినిమాలు బోల్తా కొట్టాయి. సినిమా కెరీర్ అనుకున్న స్థాయిలే లేకపోయినా వ్యక్తిగతంగా ప్రవర్తన చాలా మంచిగా ఉంటుంది. తన ఫ్యామిలీని ఎంతో గౌరవిస్తాడు. మెగా ట్యాగ్‌ను ఎప్పుడూ మర్చిపోడు.
అయితే ఇప్పుడు వరుణ్ కి ఓ డీసెంట్ హిట్ అవసరం. మరో పదేళ్ల పాటు కెరీర్ భద్రంగా సాగాలంటే.. రాబోతున్న సినిమాలపై, కథలపై తాను తీవ్రంగా కసరత్తు చేయాలి. ప్రస్తుతం కొరియన్ కనకరాజు చేస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే మనోడి కెరీర్ ట్రాక్ ఎక్కుతుంది.