టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ టాలీవుడ్ కి నిజంగా పెద్ద పండుగే. భారీ సినిమాలు సంక్రాంతి టార్గెట్ గా బరిలోకి దిగుతాయి. మూడు నాలుగు భారీ సినిమాలు ఒకే వారంలో వచ్చినా అన్ని సినిమాలకు మంచి కలెక్షన్లు ఇచ్చి సూపర్ హిట్ చేస్తారు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో సంథ్య థియేటర్ ఇష్యూ బాగా పెద్దది అయిపోయింది. పుష్ప 2 సంథ్య థియేటర్ ప్రీమియర్ షో టైంలో జరిగిన విషాదం నేపథ్యంలో తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతిని ఇచ్చేది లేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
ఇక టికెట్ రేట్ల విషయంలో కూడా షరతులు వర్తిస్తాయి అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఇక నుంచి తెలంగాణలో పెద్ద సినిమాలకు కష్ట కాలమే అని చెప్పాలి. ఎందుకంటే ఇకపై తెలంగాణలో ప్రీమియర్ షోలు ఉండవు.. బెనిఫిట్ షోలు ఉండవు.. పెద్ద సినిమాలకు టిక్కెట్ రేట్ల పెంపు కూడ ఉండదు. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ? అనేది హాట్ టాపిక్ గా మారింది.ఏదేమైనా బన్నీ చేసిన పనితో.. అక్కడ ఇష్యూ జరగడం.. ప్రాణాలు పోయే వరకు రావడంతో ఈ ఎఫెక్ట్ సంక్రాంతికి వస్తోన్న బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాలకు తెలంగాణలో ప్రీమియర్లు, బెనిఫిట్ షోలు, టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతి ఉండదు. కాబట్టి, ఏపీలో ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ కి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.