MoviesTL రివ్యూ: UI ... ఉపేంద్ర మైండ్ బ్లోయింగ్‌.. మెస్మ‌రైజ్‌

TL రివ్యూ: UI … ఉపేంద్ర మైండ్ బ్లోయింగ్‌.. మెస్మ‌రైజ్‌

బ్యాన‌ర్‌: ల‌హ‌రి ఫిలింస్‌, వీన‌స్ ఎంట‌ర్టైన‌ర్స్‌
టైటిల్‌: UI
న‌టీన‌టులు: ఉపేంద్ర‌, రీష్మా నానయ్య, ఇంద్రజిత్ లంకేష్ తదితరులు
సినిమాటోగ్ర‌ఫీ: హెచ్‌సీ. వేణు
ఫైట్స్‌: థ్రిల్ల‌ర్ మంజు, ర‌వివ‌ర్మ‌, చేత‌న్ డిసౌజా
ఎడిటింగ్‌: విజ‌య్ రాజ్‌
మ్యూజిక్‌: అజ‌నీష్ లోక‌నాథ్‌
నిర్మాత‌లు: జీ మ‌న్మోహ‌న్‌, శ్రీకాంత్ కేపీ
ర‌చ‌న – ద‌ర్శ‌క‌త్వం: ఉపేంద్ర‌
సెన్సార్ రిపోర్ట్ : U / A
ర‌న్ టైం: 130 నిమిషాలు
రిలీజ్ డేట్ : 20 డిసెంబ‌ర్‌, 2024Upendra`s UI Cheap Song

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన ‘ యూఐ ’ ఈరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉప్పీ గత సినిమాల్లాగే యూఐ కూడా డిఫరెంట్‌గా ఉండబోతోందని ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్లు చెప్పేశాయి. ఒక‌ప్పుడు ఉపేంద్ర అంటే ఇండియ‌న్ సినిమాలో ట్రెండ్ సెట్ట‌ర్‌. ఇక చాలా యేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఉపేంద్ర న‌టించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ యూఐ సినిమాపై మంచి హైప్ రావ‌డంతో ఉపేంద్ర తెలుగులోనూ ప్ర‌మోష‌న్లు చేశారు. ఇక్క‌డ గీతా సంస్థ ఈ సినిమా పంపిణీ హ‌క్కులు తీసుకుంది. ఈ రోజు పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన యూఐ సినిమా ఎలా ఉందో TL స‌మీక్ష‌లో చూద్దాం.
UI Movie: ఉపేంద్ర సినిమాపైనే అందరి చూపు.. మళ్లీ వింటేజ్ మ్యానియా తెస్తాడా..  ?స్టోరీ :
పగలు – రాత్రి సత్య ( ఉపేంద్ర ) వర్సెస్ కల్కి భగవాన్ కాన్సెప్ట్ తో ఈ సినిమా కొనసాగుతుంది. 2040 లో ప్రపంచం ఎలా ఉంటుంది ? అనే కాన్సెప్ట్ తో ఉపేంద్ర సెటైరికల్ విధానంలో ఈ సినిమాను తెరకెక్కించారు. హీరోగా దర్శకుడుగా ఉపేంద్ర వన్ మ్యాన్ షో చేసి చూపించారు. తన డిఫరెంట్ టేకింగ్ తో వింటేజ్ ఉపేంద్ర‌ని గుర్తు చేశాడు. హీరోయిన్‌తో వచ్చే సైకో లవ్ ట్రాక్‌లో వింటేజ్ ఉపేంద్రను గుర్తుకు తెచ్చాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ తో తన ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ చేసాడు ఈ సూపర్ స్టార్. ఇక సినిమాలో వచ్చే పాటలు సైతం సెటైరికల్ గానే ఉన్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కు తగినట్టుగా పాటలు తెరకెక్కించారు. సినిమాలో ఓ ఎపిసోడ్ ప్రపంచంలో ఇంతవరకు ఏ దర్శకుడు ? కూడా ఇలా తీయాలని ఆలోచన రాని విధంగా తెరకెక్కించాడు ఉపేంద్ర. ఇది థియేటర్లో చూస్తేనే చాలా మస్తు మజా అనిపించేలా ఉంది.

డైరెక్టర్గాను ఉపేంద్ర తన డిఫరెంట్ టేకింగ్ తో పాత ఉపేంద్రను గుర్తుకు తెచ్చాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సినిమా క్లైమాక్స్ మరో ఎత్తు. ఈ సినిమాకు రెండు డిఫరెంట్ క్లైమాక్స్‌లో పెట్టాలని ఆలోచన వచ్చినందుకు ఉపేంద్రకు హ్యాట్సాఫ్ చెప్పాలి. మేకింగ్ లోను క్వాలిటీ తెరమీద కనిపిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఉపేంద్ర వన్ మీన్ షో తో యుఐ సినిమాను అదరగొట్టి పడేసాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కథ‌ అంతా ఉపేంద్ర చుట్టూనే తిరుగుతుంది. ఉపేంద్ర దర్శకుడు గానే కాకుండా నటనతో కూడా మంచి మార్కులు వేయించుకున్నాడు. ప్రపంచం ఫేస్ చేస్తున్న రియల్ ప్రాబ్లం తెర‌ మీద బలంగా చూపించడంలో ఉపేంద్ర సక్సెస్ అయ్యాడు.Upendra's #Ui The Movie First Look Teaser Transforms Viewers Into A Fantasy  World - Telugu Rajyamసినిమాలో చెప్పుకోవ‌డానికి ఒక్క‌టేమిటి చాలా హైలెట్స్ ఉన్నాయి. 2024 క‌ల్కి ఎపిసోడ్ – హీరోయిన్ సైకో ల‌వ్ ట్రాక్ – పెద్ద‌ది, చిన్న‌ది సాంగ్ పిక్చ‌రైజేష‌న్ – టెంపుల్ ఫైట్ – ఎల‌క్ష‌న్ లీడ‌ర్స్ ఫైట్ – ద‌ర్శ‌కుడు ఉపేంద్ర‌, క‌ల్కి మ‌ధ్య ఆర్గ్యుమెంట్ సీన్లు అదిరిపోయాయి. ఇక సినిమాలో క్యారెక్ట‌ర్‌తో డైరెక్ట‌ర్ ఆర్గ్యు చేయ‌డం సినీ చ‌రిత్ర‌లోనే ఎవ్వ‌రూ చేయ‌లేదు.. చేయ‌బోరు కూడా అన్న‌ట్టుగా ఉంది. ఇలా చేయాల‌న్న ఊహ‌లోనే భ‌య‌ప‌డ‌తారు.

మీరు ఇంటెలిజెంట్ అనుకుంటే వెంటనే థియేటర్ నుంచి బయటికి వెళ్ళండి అంటూ మొదట్లోనే ప్రేక్షకులకు ఉపేంద్ర సవాలు విసిరాడు.. దీనితోనే ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అవుతుంది. రియ‌ల్ టైం ప్రాబ్లంతో హార్ట్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్ తో సినిమా అదరగొట్టి పడేసింది. ఇలాంటి కథలు ఉన్న సినిమాలు రావటం చాలా అరుదు.. ఇంకా ఇండియాలో దశాబ్దానికి ఒకటి రావటమే మహా అరుదు. మ‌స్ట్‌గా ప్రతి ఒక్క‌రు వాచ్ చేయాల్సిన సినిమా.

Upendra Shares Update About UI The Movie - It Has A Valentine's Day  Connection | Republic World

ఫైన‌ల్ పంచ్ : వింటేజ్ ఉపేంద్ర రీ ఎంట్రీ

UI రేటింగ్ : 3 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news