పరిచయం :
హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ నుంచి యానిమేషన్ సినిమా వస్తుందంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో తెలిసిందే. ఈ క్రమంలోనే డిస్నీ నుంచి వచ్చిన కొత్త యానిమేటెడ్ సినిమా ముఫాసా ది లయన్ కింగ్. రెండుసార్లు ఒకే కథతో లైన్ కింగ్ సినిమా తీసి అందరిని అలరించిన ముఫాసా ఇప్పుడు మెప్పించిందో లేదో రివ్యూలో చూద్దాం.
కథ :
పెద్ద సింహం కొడుకు అయిన ముఫాసా చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉంటాడు. వేగంలో.. తెలివిలో తనకు తానే సాటి. ఓ వరదలో కొట్టుకుపోయి తల్లిదండ్రులకు దూరమైన ముఫాసా మరో రాజ్యంలో అనాధలా పెరుగుతాడు. ఆ రాజ్యానికి అధిపతి అయిన ఒబాసికి ముఫాసా అంటే అసలు ఇష్టం ఉండదు. అతడి భార్య కొడుకు ముప్పాసాను చేరదీస్తారు. ముఫాసా పెరిగి పెద్దదయ్యాక కూడా ఒబాసికి అతడి మీద అయిష్టత తగ్గదు. ఈ టైంలో ప్రమాదకర తెల్ల సింహాలు ఒబాసి భార్య మీద దాడి చేస్తాయి. ఆ దాడి నుంచి కాపాడే ప్రయత్నంలో ఆ తెల్ల సింహాల రాజు కొడుకును ముఫాసా చంపేస్తాడు. దీంతో రాజు అతడు పై కక్షగట్టి అతడి వాళ్ళందరినీ అంతం చేయడానికి బయలుదేరుతాడు. మరి తెల్ల సింహాల నుంచి ముఫాసా తప్పించుకున్నాడా ? వాటితో పోరాడి గెలిచాడా ఇంతకీ తన తల్లిదండ్రులు ఏమయ్యారు ? వాళ్ళను కలుసుకున్నాడా లేదా అన్నది మిగిలిన కథ.
విశ్లేషణ :
జంతువులు మాటలు.. ఎక్స్ప్రెషన్లు.. హావభావాలు యానిమేషన్లో ఎన్నో అద్భుతాలు చేస్తుంటారు. ‘ముఫాసా’లో ప్రధాన పాత్రకు మహేష్ బాబు వాయిస్ ఇవ్వడం అత్యంత ఆసక్తి రేకెత్తించిన అంశం. మహేష్ వాయిస్ లో ముఫాసా పాత్రను చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు మంచి అనుభూతి కలుగుతుంది. యానిమేటెడ్ మూవీ అనే భావన రాకుండా సహజత్వం ఉట్టిపడేలా ఈ కథకు దృశ్యరూపం ఇచ్చిన తీరు బాగుంది. ఒక భిన్నమైన కథను చూడాలనుకునే వాళ్లకు ఇది నిరాశ కలిగిస్తుంది. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్టుల మధ్య ‘ముఫాసా’ చూస్తున్నంత సేపూ నిజంగా మనం ఓ అడవిలో జంతువుల మధ్య ఉన్నాం అన్న ఫీలింగ్ కలుగుతుంది. బలమైన ఎమోషన్ లేని ఒక మామూలు కథతోనే సరిపెట్టేశారు.
చిన్నతనంలో తల్లిదండ్రులకు దూరమయ్యే ఓ కొడుకు.. ఆ బిడ్డను చేరదీసి తన కొడుకుతో పాటు పెంచే మరో తల్లి.. ఇది అసలు నచ్చని తండ్రి.. ఇలా పాత్రలు అన్నీ మన ముందు కదలాడుతూనే ఉంటాయి. వాటి మధ్య సీన్లు సగటు కుటుంబం బంధాలను తలపిస్తాయి. కథగా మాత్రం ముఫాసా ఎగ్జైట్ చేయదు. విలన్ తో హీరో గొడవ.. వారి మధ్య పోరాటం కూడా చాలా సాధారణంగా అనిపిస్తుంది. కథలో బలమైన ఎమోషన్ లేకుండా విజువల్‌గా ఎంత బాగున్నా మనస్సును హత్తుకోదు. విసుగు పుట్టించేలా పెట్టిన పాటలు సినిమాకు పెద్ద మైనస్. డైలాగులు మాత్రం భలే గమ్మత్తుగా రాశారు. చాలా చోట్ల సంభాషణల్లో చమత్కారం ఉంది.
బ్రహ్మానందం-ఆలీ-జబర్దస్త్ శేషు గాత్రదానం చేసిన పాత్రలతో బాగానే నవ్వించగలిగారు. విలన్ పాత్రకు అయ్యప్ప పి.శర్మ డబ్బింగ్ బాగుంది. సాంకేతిక హంగులకు సినిమాలో లోటు లేదు. మహేష్ వాయిస్ ద్వారా దాని లోపాలను కొంత కవర్ చేశాడు.
ఫైనల్‌గా..
వీక్ కథకు కళ్లు చెదిరే విజువల్సే ఈ ముసాఫా ..
ముసాఫా రేటింగ్ : 2 / 5