MoviesTL రివ్యూ: బ‌చ్చ‌ల‌మ‌ల్లి... అల్ల‌రోడిని ముంచేసిందా...!

TL రివ్యూ: బ‌చ్చ‌ల‌మ‌ల్లి… అల్ల‌రోడిని ముంచేసిందా…!

నాందితో అల్లరి నరేష్ ప్రయాణం మారిపోయింది. కామెడీ సినిమాలను పక్కన పెట్టి సీరియస్ కథ‌ల వైపు దృష్టి సారిస్తున్నాడు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బచ్చలమ‌ల్లి అనే సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్ .. ట్రైలర్ తోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. మరి బచ్చలమ‌ల్లి ప్రేక్షకుల అంచనాలు ఎంతవరకు అందుకుందో చూద్దాం.

Allari Naresh: బచ్చలమల్లి అదృష్టవంతుడే! | Good business for Allari naresh  Machalamalli movie avmక‌థ :

బచ్చలమ‌ల్లి ( నరేష్ ) కి తండ్రి అంటే చాలా ఇష్టం. తండ్రికి కొడుకు అంటే ప్రేమ అయితే రెండో పెళ్లి చేసుకుని తన తల్లికి అన్యాయం చేశాడని కష్టాల్లో ఉన్నప్పుడు తనని వదిలి వెళ్ళిపోయాడని తండ్రి పై కోపం పెంచుకుంటాడు.. మళ్ళీ అది పగగా మారుతుంది. తాగుడికి బానిస అవుతాడు. అన్నిటికీ మించి మూర్ఖత్వం మీటర్ దాటుతుంది. మళ్లీ కావేరి ( అమృత అయ్యర్ ) ని ఇష్టపడతాడు. ఆమె కోసం చెడు అలవాట్లు మానేస్తాడు.. మంచి మనిషి అవుతున్నాడు అనుకున్న టైంలో మల్లి మళ్లీ తప్పుడు దారి పడతాడు. తన జీవితాన్ని ఎలా చేజేతులా నాశనం చేసుకున్నాడు అన్నదే కథ‌.

విశ్లేష‌ణ :
జీవితం అన్నాక పట్టువిడుపులు ఉండాలి. బంధాలు.. అనుబంధాలు ఉండాలి అంటే కోపాలు ప్రతీకారాలు పక్కన పెట్టాలి. లేదంటే చివరికి ఒంటరిగా ఉండాలి. ఈ సినిమాలో హీరో జీవితంలో అదే జరుగుతుంది. సీన్ నెంబర్ 1 నుంచి సేన్ నెంబర్ 60 వరకు దర్శకుడు రాసుకున్నది హీరో పాత్ర మాత్రమే. అతడి కోపం .. పంతం.. మూర్ఖత్వం ప్రతి సీన్లోను కనిపిస్తుంది. బాల్యం తండ్రిపై కోపం జీవితాన్ని నాశనం చేసుకోవడం .. ప్రేమకథ ఇవన్నీ సీన్ బై సీన్ పేర్చుకుంటూ వెళ్ళాడు దర్శకుడు. అయితే సడన్గా అమ్మాయి ప్రేమలో పడటం ఇంత మార్పు ? అంత కన్విన్స్ంగా అనిపించదు. ఎవరికోసం ఎందుకు మారాలి ? అనే ట్యాగ్ లైన్‌తో బతికే మల్లిగాడు అమ్మాయి చెడు అలవాట్లు అన్ని మానేయ్ అంటే మరో ఆలోచన లేకుండా మానేస్తాడు. చివర్లో తల్లి చెప్పే మాటలు మళ్ళీ కన్విన్స్ అయిపోతాడు.. తండ్రికి మల్లితో గొడవ .. అది ఈ కథకు చాలా బలమైన ఎలిమెంట్ .. తండ్రి పాత్ర చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అలాంటి పాత్ర పై హీరో కోపం పెంచుకోవడం ప్రేక్షకుల్లో హీరో పట్ల వ్యతిరేకంగా అనిపిస్తుంది.

బచ్చలమల్లి… ఓ మొరటోడి కథ Great Andhra

మూర్ఖ‌త్వం బోర్డర్ దాటిన హీరో కథ‌ ఇది. ఆ మూర్ఖత్వమే సినిమా కొంప ముంచినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్లలో దర్శకుడికి మంచి మార్కులు పడతాయి ఈ సినిమా క్లైమాక్స్ మంచి ఎమోష‌న్‌తో ముగించినా హ‌త్తుకోదు. అల్ల‌రి న‌రేష్‌కు న‌ట‌నా ప‌రంగా గుర్తుండిపోయే పాత్ర ఇది. టెక్నిక‌ల్ గా బ‌చ్చ‌ల‌మ‌ల్లి బాగుంది. న‌రేష్ గ‌త సినిమాల‌తో పోలిస్తే క్వాలిటీ మేకింగ్ క‌నిపించింది. ద‌ర్శ‌కుడు సుబ్బు క‌థ‌ని కంటే క్యారెక్ట‌రైజేష‌న్‌ని న‌మ్ముకొన్నాడు. అంత వ‌ర‌కూ బాగుంది. న‌రేష్‌లోని న‌టుడిని సంతృప్తి ప‌రిచినా.. రెండున్న‌ర గంట‌ల పాటు సినిమాను చూసే ప్రేక్ష‌కుడిని మాత్రం ఈ బ‌చ్చ‌ల‌మ‌ల్లి సంతృప్తి ప‌ర‌చ‌లేదు.

బ‌చ్చ‌ల‌మ‌ల్లి.. ఓన్లీ న‌రేష్ రోల్ మాత్ర‌మే హిట్‌

బ‌చ్చ‌ల‌మ‌ల్లి రేటింగ్ : 2.25 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news