ఆర్.నారాయణమూర్తి ఈ పేరు తెలియని తెలుగు ప్రజలు ఉండరు .. చిత్ర పరిశ్రమలో ఈనది ఓ సపరేట్ స్టైల్ . కెమెరాకి ముందు వెనకాల ఒకేలా ఉండే వ్యక్తిత్వం ఆర్ నారాయణమూర్తి సొంతం .. పోరాట విప్లవ ప్రధాన సినిమాలు నిర్మించి నటించారు ఆర్.నారాయణమూర్తి.. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన నారాయణమూర్తి సినిమాల మీద ఆసక్తితో ఎన్టీఆర్ , నాగేశ్వరరావు సినిమాలు చూసి ఎలాగైనా సినిమాలో నటించాలని అనుకున్నారు .. అదే విధంగా సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను గమనించి విప్లవ ఉద్యమాల వైపు మనసు మళ్లింది .. ఇక ఆయన సినిమాల్లోనూ ప్రజల బాధలు విప్లవ భావాలే కనిపిస్తాయి .. ఎన్నో గొప్ప సినిమాలను నిర్మించి నటించారు ఆర్.నారాయణమూర్తి .. ఇక దాసరి నారాయణరావు గారితో పరిచయం కారణంగా కృష్ణ సినిమా నేరము శిక్ష మూవీలో ఈయనకు చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది.
ఇక తర్వాత వరుసగా సినిమాలో నటించుకుంటూ వెళ్లారు .. ఎర్రసైన్యం, చీమలదండు, ఇలా పలు విప్లవ ప్రధానమైన సినిమాలు చేసి మెప్పించారు నారాయణమూర్తి .. ఎలాంటి ఆడంబరాలు లేకుండా సాధారణ జీవితం గడపడానికి ఎంతో ఇష్టపడతారు .. నిర్మాతిగా నటుడుగా హేతివాదిగా, అవివాహితుడు. ఆర్ నారాయణ మూర్తి .. అయితే నారాయణమూర్తికి కూడా ఓ ప్రేమ కథ ఉంది .. ఈయన అమ్మాయిని ఎంతగానో ప్రేమించి ఆరాధించారు. కానీ ఆ ప్రేమ కథ సరిగ్గా సుఖాంతం కాలేదు .. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ తన ప్రేమ కథ గురించి చెప్పారు.
ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. తన ప్రేమ కథ గురించి చెప్పారు.. అందులో మీరు ఇంతవరకు ఎవరినైనా ప్రేమించారా ? అన్న ప్రశ్నకు నారాయణమూర్తి సమాధానం ఇస్తూ.. నేను ప్రేమించాను ఓ అమ్మాయిని .. ఆమె కూడా నన్ను మనస్పూర్తిగా అభిమానించింది.. నేను కూడా ఆమెను మనస్ఫూర్తిగా అభిమానించా అయితే ఓ రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్లాను.. నన్ను వాళ్ళ అమ్మానాన్నలకు పరిచయం చేయడానికి రమ్మంటే వెళ్లాను .. మొదటిసారి ఆమె ఇంటికి వెళ్లాను వాళ్ళు చాలా డబ్బు ఉన్నవాళ్లు.. నా జీవన విధానం వేరు వాళ్ళ జీవన విధానం వేరు అప్పుడు అక్కడి నుంచి నేను బయటికి వచ్చేసా నాది ప్లాట్ ఫ్రమ్ జీవితం ఆమె చాలా డబ్బున్న అమ్మాయి నా భార్యను నేను మంచిగా చూసుకోవాలి నాలా ఫ్లాట్ ఫారం మీద పెట్టకూడదు. నా కోరిక సినిమాల్లో నటించడం నాకు అవకాశాలు వస్తాయో.. రావో ఎన్నేళ్లు పడుతుందో తెలియదు .. ఎందుకు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని తెచ్చుకొని ఆమె జీవితాంతం నరకయాతన పడటం అని ఆమెకు వివరంగా చెప్పి. నన్ను అపార్థం చేసుకోవద్దు మీరు వేరే పెళ్లి చేసుకుని మీ జీవితంలో హ్యాపీగా ఉండండి.ఆ తర్వాత నేను అక్కడి నుంచి మద్రాస్ వెళ్లిపోయాను .. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య ఉత్తరాలు రాసుకోవడం వంటివి కూడా జరగలేదు.. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎంతగానో ఏడ్చింది.. నేను కూడా ఎంతో బాధపడ్డాను ఆ తర్వాత ఆమెతో టచ్ లో కూడా లేను ఆమె ఎక్కడికో వెళ్లి పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవితం గడుపుతుంది.. ఇక తర్వాత ఆమెను చూడాలనిపించింది మళ్ళీ వెళ్లి ఆమెను చూసి నేను బాధపడాలి ఎందుకు అని అక్కడే అది వదిలేసాను.. అని నారాయణమూర్తి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చారు. అలా తన పెళ్లి చేసుకుని అమ్మాయి జీవితం నాశనం చేయకూడదని తన ప్రేమే త్యాగం చేశారు నారాయణమూర్తి.