కన్నడ సూపర్‌స్టార్, సీనియర్ హీరో ఉపేంద్ర కంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు కాదు 20 ఏళ్ల క్రితమే ఉపేంద్ర కథలు, స్క్రీన్ ప్లే, పాత్రలు అన్నీ కొత్తగా ఉంటాయి. ఉపేంద్ర సినిమాలో తాను చెప్పాలనుకొన్న విషయాన్ని సూటిగా, సుత్తి లేకుండా చెప్పేస్తాడు. ఉపేంద్ర సినిమాల టైటిల్స్‌కూడా ఆకట్టుకొనేలా .. ఆసక్తిగా ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే ఓ కన్నడ హీరోకంటూ తెలుగులో మార్కెట్ తీసుకొచ్చిన మొదటి హీరో ఉపేంద్రనే. కన్నడలో ఎంతమంది స్టార్లు వచ్చినా, ఉపేంద్ర స్థానం ఉపేంద్రకే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఉపేంద్ర నుంచి యూఐ అనే సినిమా వస్తోంది.ఈ సినిమా టీజర్, ట్రైలర్ అన్నీ ఆసక్తికరంగా సాగాయి. ఇక ట్రైలర్లో విజువల్స్ చాలా కొత్తగా అనిపించాయి. దాంతో పాటు ఉప్పీ గెటప్ కూడా తనదైన స్టైల్ లో ఆకట్టుకొంటుంది. ఇటీవల ఉపేంద్ర సినిమాల్లో యూఐ సినిమా గురించి ఎప్పుడూ జరగనంత చర్చ నడుస్తోంది. ఇటీవల ఉపేంద్ర ఎన్ని సినిమాలు చేసినా రానంత క్రేజ్, బజ్ ఈ సినిమాకు వచ్చింది. పైగా దాదాపు తొమ్మిదేళ్ల తరవాత ఉపేంద్ర దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. అందుకే.. ఆ బజ్ మరింత పెరిగింది.
ఇక ప్రమోషన్లు కూడా స్పీడుగానే చేశాడు. ఇక ఈ సినిమా కథేంటి ? అనే విషయాన్ని ఉపేంద్ర ఇప్పటి వరకూ ఎక్కడా బయటపెట్టలేదు. కాన్సెప్ట్ కూడా చెప్పలేదు. అయితే ఇది గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో ఉండే కథని తెలుస్తోంది. రాజకీయ నాయకులు ప్రజల్ని బకరాలుగా ఎలా చేసి, తమ స్వార్థానికి వాడుకొంటున్నారో, ఉచిత పధకాలతో ఎంత ప్రమాదమో ఈ సినిమాలో ఉపేంద్ర చెపుతున్నట్టు తెలుస్తోంది.
సినిమాలో చాలా పాత్రలు, డైలాగులు సమకాలీన రాజకీయాలను.. రాజకీయ నాయకులను ఎండగడతాయని తెలుస్తోంది. రన్ టైమ్ కూడా షార్ప్‌గా ఉంది. 2 గంటల 13 నిమిషాలు మాత్రమే. ఏదేమైనా యూఐ తెలుగు జనాలకు కనెక్ట్ అయితే సరికొత్త సంచలనం నమోదు కావడం ఖాయం.