టాలీవుడ్ లెక్కలు తెలిసిందే. ఏపీలో 50 పైసలు, సీడెడ్ 20 పైసలు, నైజాంలో 30 పైసలు ఉంటాయి. ఇటీవల కాలంలో లెక్కలు మారిపోయాయి. నైజాం లెక్క కూడా 50 పైసలకు చేరుకుంది. ఏపీ కంటే నైజాంను ఎక్కువ రేట్లు పెట్టి కొంటున్నారు. కలెక్షన్లు కూడా అలాగే ఉంటున్నాయి. పుష్ప 2 సినిమా విషయానికి వస్తే సీడెడ్ కాకుండా ఏపీ రు. 85 కోట్లు విక్రయిస్తే నైజాంను రు. 100 కోట్లకు విక్రయించారు.ఇప్పటికే రు. 82 కోట్ల షేర్ వచ్చేసింది. 18 % జీఎస్టీతో కలుపుకుని ఉంటే ఆ టార్గెట్ వచ్చేసినట్టే. ఈ రోజు నుంచి వచ్చే వసూళ్లు అన్నీ కమీషన్ లెక్కే. వంద కోట్ల షేర్ వస్తే రు. 18 కోట్లు కమీషన్‌గా వస్తుంది. ప్రస్తుతం రోజుకు నైజాంలో రు. 60 లక్షలకు పైగానే కలెక్షన్లు వస్తున్నాయి. ఓ వైపు క్రిస్మస్ సెలవులు స్టార్ట్ అవుతున్నాయి.నైజాంలో థియేటర్లు ఫుల్లుగా ఉన్నాయి. పైగా దగ్గర్లో న్యూ ఇయర్ ఉంది. అందువల్ల టార్గెట్ రీచ్ అవుతామన్న ధీమా మేకర్స్‌లో ఉంది. సంక్రాంతికి కూడా కొన్ని థియేటర్లు ఉంటాయి. పైగా మైత్రీ పంపిణీ దారులకు రాబిన్‌హుడ్ కూడా ఉంది. ఈ సినిమాను వెనక్కు పంపారు. దీంతో పుష్ప కొంత కాలం స్టడీగా ఉండే ఛాన్సులు ఉన్నాయి.