Moviesటాలీవుడ్‌లో ఓ క్రేజీ హీరో... ఓ హీరోయిన్ సైలెంట్‌గా ప్రేమ‌లో ప‌డ్డారు...!

టాలీవుడ్‌లో ఓ క్రేజీ హీరో… ఓ హీరోయిన్ సైలెంట్‌గా ప్రేమ‌లో ప‌డ్డారు…!

ఆమె టాలీవుడ్ లో ఓ యంగ్‌ క్రేజీ హీరోయిన్ .. అతడు ఓ యంగ్ హీరో. ఆ హీరో అందగాడు .. మంచి సినిమా చేశాడు. కొన్ని మంచి సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఎప్పటికైనా టాలీవుడ్ లో ఓ మంచి హీరోగా పేరు తెచ్చుకుంటాడు అన్న నమ్మకాలు ఉన్నాయి. ప్రస్తుతానికి జనాల దృష్టిలో పడకుండా చాలా సైలెంట్ గా తన పని చేసుకోపోతున్నాడు.

12,557 Couple Love Shadow Stock Photos - Free & Royalty-Free Stock Photos  from Dreamstime

క్రేజీ హీరోయిన్ చక చక సినిమాలు చేసుకుంటుంది .. చాలా తెలివైన అమ్మాయి ఎవరితో ? ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ ఎవరిని ఎంతవరకు రానివ్వాలో అంతవరకే రాణిస్తూ చాలా స్పీడ్ గా హుషారుగా ముందుకు సాగుతోంది. ఈ అందమైన హీరోయిన్ మీద ఇప్పటివరకు ఎలాంటి పుకార్లు లేవు. అంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అయితే ఇప్పుడు ఆ హీరో ఈ హీరోయిన్ ఇద్దరు ప్రేమలో ఉన్నారని గుసగుసలు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మంచి స్నేహితులుగా ఉంటూ మంచి ప్రేమికులుగా మారే దశలో ఉన్నారని భవిష్యత్తులో పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్న టాక్ వినిపిస్తోంది. పైగా ఇద్దరిదీ పెద్ద వయసు కూడా కాదు.. పెళ్లికి తొందర ఏమీ లేదు.. పెళ్లి కన్నా ముందు ఇద్దరు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఈ టైంలో ఇద్దరు సైలెంట్ గా ఉంటే వాళ్లకే మరి కొంతకాలం ముందుకు వెళుతుంది.. మరి నిప్పు లేనిదే పొగరాదు. అన్నట్టుగా వీరిద్దరూ నిజంగా ప్రేమించుకుంటున్నారా ? వీరి ప్రేమ పెళ్లి పీటల వరకు వెళుతుందా లేదా అన్నది చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news