నందమూరి నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ సినిమా ఎలాంటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. మామూలుగానే బాలయ్య – బోయపాటి అంటే తిరుగులేని క్రేజీ కాంబినేషన్. వీరి కాంబోలో వచ్చిన సింహా – లెజెండ్ – అఖండ ఒక దానిని మించి మరొకటి హిట్ అయ్యాయి. అందుకే ఇప్పుడు వీరి కాంబోలో వస్తోన్న నాలుగో సినిమా ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ప్రస్తుతం బోయపాటి ఈ సినిమాలోని బాలయ్య రెండో పాత్రకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. జనవరి మూడో వారం నుంచి అఖండ పాత్ర సన్నివేశాలు తెరకెక్కిస్తారట. ఈ సన్నివేశాలు కంప్లీట్ యాక్షన్ మోడ్‌లోనే సాగుతాయంటున్నారు. ఇక ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా… మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారని.. వారితో పాటు ఇతర నటీనటుల ఎంపికలో బోయపాటి ఉన్నట్టు సమాచారం.