Moviesమోక్ష‌జ్ఞ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫేవ‌రెట్ బ్యూటీ... !

మోక్ష‌జ్ఞ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫేవ‌రెట్ బ్యూటీ… !

టాలీవుడ్‌లో నంద‌మూరి ఫ్యామిలీ వార‌సుడు మోక్షజ్ఞ సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినిమా అభిమానులు ఎంతలా వెయిట్ చేస్తున్నారో తెలిసిందే. కొంతకాలంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఆశ‌లు మామూలుగా లేవు. ఫైనల్లీ ఆ ఛాన్స్‌ను హ‌నుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో సూప‌ర్‌హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మకి ఇచ్చాడు బాలకృష్ణ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ ఇవ్వబోతున్న విష‌యం బ‌య‌ట‌కు రాగానే ఒక్క‌సారిగా మోక్ష‌జ్ఞ డెబ్యూపై స్కై రేంజ్‌లో అంచ‌నాలు వ‌చ్చేశాయి.Ileana D'cruz: సెల్ఫీలతో సెగలు పుట్టిస్తోన్న బ్యూటీ.. ఇలియానా ఫోజులకు ఫిదా అవ్వాల్సిందే.. - Telugu News | Ileana d'cruz latest pics goes viral on social media | TV9 Teluguఈ ప్రాజెక్టు ఎందుకో గాని న‌త్త‌న‌డ‌క‌లా ముందుకు వెళుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్‌ బయటకు వచ్చింది . ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో ఒక‌ప్ప‌టి స‌న్న‌న‌డుము సుంద‌రి ఇలియానా కూడా నటించబోతుందట. ఇది నిజ‌మే అంటున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం ఇలియానాను తీసుకున్నార‌ట‌. అయితే ఇది సినిమాను మ‌లుపు తిప్పే కీల‌క పాత్ర అవుతుంద‌ని అంటున్నారు.
Jalsa Movie HD wallpaper Pawan Kalyan ileana D'Cruzఇలియానా తెలుగు సినిమాను వ‌దిలేసి చాలా కాల‌మే అవుతోంది. ఆమె నంద‌మూరి హీరోల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్ ప‌క్క‌న రాఖీ – శ‌క్తి సినిమాల్లో న‌టించింది. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఆమె నంద‌మూరి హీరో సినిమాలో.. అందులోనూ చాలా యేళ్ల త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉండ‌గానే బాలీవుడ్‌కు వెళ్లి ఆమె చేతులు కాల్చుకుంది. పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చి సోషల్ మీడియాలో తన పేరు గబ్బు లేపుకునేలా చేసి.. చాలా త్వ‌ర‌గా ఫేడ‌వుట్ అయిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news