పుష్ప హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంథ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇది పూర్తిగా అల్లు అర్జున్ తప్పిదమే అని అరెస్టు చేశారు. అర్జున్ రెండు రోజుల క్రిందటే ఈ కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ కూడా వేశారు. అయితే ఈ రోజు పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. సంథ్య థియేటర్ యజమాన్యం కూడా తాము థియేటర్ ఓనర్లమే అయినా లీజుకు ఇచ్చామని.. బాధ్యత తమది కాదని స్పష్టం చేసింది.
అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటీ వచ్చినప్పుడు ముందస్తుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కానీ అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డిని తీసుకుని మరీ ప్రీమియర్‌కు వెళ్లాడు. థియేటర్‌కు కిలోమీటర్ ముందు నుంచే ఓపెన్ టాప్ జీపులో ర్యాలీ చేశారు. థియేటర్ లోపలకు వెళ్లిన టైంలో ప్రేక్షకులు ఒక్కసారిగా తోసుకోవడంతో రేవతి మృతిచెందారు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పోలీసులు విచారణ తర్వాత కోర్టులో హాజరు పరుస్తారు. కోర్టు ఆయనను రిమాండ్ తరలిస్తుందా.. వ్యక్తిగత పూచికత్తు కింద బెయిల్ ఇస్తుందా అన్నది కీలకంగా మారింది. రిమాండ్ కు తరలిస్తే పుష్పరాజ్ జైల్లో గడపాల్సిందే.