Moviesమైత్రీ వ‌ర్సెస్ దిల్ రాజు... మ‌ళ్లీ గొడ‌వ రాజుకున్న‌ట్టేనా.. ?

మైత్రీ వ‌ర్సెస్ దిల్ రాజు… మ‌ళ్లీ గొడ‌వ రాజుకున్న‌ట్టేనా.. ?

టాలీవుడ్‌లో సంక్రాంతి అంటే చాలు..రచ్చ మాములుగా ఉండదు. మా సినిమాకి థియేటర్లు ఇవ్వలేదు అని ఒక‌రు అంటే.. మా సినిమాకు థియేట‌ర్లు ఇవ్వ‌లేదు అని మ‌రొక‌రు అంటారు. గ‌త రెండు.. మూడు సంక్రాంతుల‌కు ఇదే న‌డుస్తోంది. అయితే సంక్రాంతి టైంలో ఎక్కువుగా వినిపించే పేరు దిల్ రాజుది. ముందు ఆయ‌న తాను నిర్మించిన‌.. తాను పంపిణీ చేసే సినిమాల‌కు మిన‌హా మిగిలిన సినిమాల‌కు థియేట‌ర్లు ఇవ్వ‌ర‌ని అంటారు. ఆ త‌ర్వాత రాజే చివ‌ర‌కు అన్ని సినిమాల‌కు థియేట‌ర్లు ఇస్తూ వ‌స్తుంటారు.

Robinhood - One More Time Lyrical | Nithiin | Sreeleela | Venky Kudumula |  GV Prakash | Vidya Vox

రెండు సంవ‌త్స‌రాలుగా దిల్ రాజుకు పోటీగా మైత్రీ వాళ్లు కూడా దిగుతుండటంతో సంక్రాంతి ఫైట్ మరింత రంజుగా మారింది. ఈ సారి కూడా సంక్రాంతికి థియేట‌ర్ల ఫైట్ త‌ప్ప‌దు. ఈ సారి సంక్రాంతికి దిల్ రాజు సొంత బ్యాన‌ర్లో నిర్మించిన గేమ్ ఛేంజ‌ర్‌తో పాటు సంక్రాంతికి వ‌స్తున్నాం రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నారు. ఇక బాల‌య్య డాకూ మ‌హారాజ్ సినిమాను కూడా దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు.

ఇలా దిల్ రాజు సినిమాలే మూడు ఉన్నాయి. ఇక మైత్రీ వాళ్ల పుష్ప 2 ఇప్ప‌డు థియేట‌ర్ల‌లో ఉంది. నితిన్ రాబిన్‌హుడ్ సినిమాను క్రిస్మ‌స్ బ‌రినుంచి త‌ప్పించి సంక్రాంతి రేసులోకి జ‌న‌వ‌రి 13న రిలీజ్ చేయాల‌ని మైత్రీ చూస్తోంది. అప్పుడు మ‌ళ్లీ థియేట‌ర్ల గొడ‌వ త‌ప్ప‌దు. మైత్రీ వాళ్లు తమ రాబిన్‌హుడ్‌ సినిమా కోసం అప్పుడే థియేటర్లను కూడా బ్లాక్ చేస్తున్నారనేలా వార్తలు మొదలయ్యాయి. ఏదేమైనా సంక్రాంతికి ఈ సారి కూడా వార్ త‌ప్పేలా లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news