టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్గా… అలాగే అంజలి హీరోయిన్ గా రూపొందుతున్న సినిమా గేమ్ ఛేంజర్. కోలీవుడ్ సీనియర్… మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్‌పై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన కొత్త ప్రోమోకి సాలిడ్ రెస్పాన్స్ వచ్చేసింది.
ఇదిలా ఉండగా ఈ సినిమా రన్ టైం పై సాలిడ్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ భారీ పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్ మొత్తంగా 162 నిమిషాల నిడివితో లాక్ అయ్యింది. ఈ విషయాన్ని యూకేలో విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేశారు. సో థియేటర్స్ లో గేమ్ ఛేంజర్ విధ్వంసం 2 గంటల 42 నిమిషాల పాటు ఉండనుంది.
శంకర్ – చరణ్ మ్యాజిక్ ప్రేక్షకులను థియేటర్లలో ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తుందో ? చూడాలి. ఈ సినిమాకు థమన్ ఎస్.ఎస్ సంగీతం అందించాడు. ఈ యేడాది జనవరి 10న గ్రాండ్ గా సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది.