పుష్ప 2 సినిమా టాలీవుడ్ లో సంచలనాలకు తెరలిపింది. వివాదాలకు దారితీసింది. ముఖ్యంగా హైదరాబాద్ తొలి మల్టీప్లెక్స్ అయిన ప్రసాద్ ఐమాక్స్ తో మైత్రి డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద గొడవ నడిచింది. కేవలం 2.5% షేరింగ్ దగ్గర ఇరు వర్గాలు బిగిసిపోయాయి.. పంతాలకు పోయాయి. ఇప్పుడు ఈ పంచాయితీ టోటల్ మల్టీప్లెక్స్ అసోసియేషన్‌కు చేరింది. విషయం ఏంటంటే మల్టీప్లెక్స్ లో సినిమాను రెంటల్ పద్ధతిలో కాకుండా షేర్ చేసుకునే పద్ధతిలో ప్రదర్శిస్తారు. అయినా పివిఆర్ లాంటి సంస్థలు టికెట్ ఆదాయంలో పన్నులు పోను.. మిగిలిన రెవెన్యూలో 45 % ఉంచుకొని 55 % శాతం నిర్మాత లేదా డిస్ట్రిబ్యూటర్ కి పంపిస్తాయి.ఇది 50 – 50 కింద మార్చాలని కొన్ని జిల్లాల్లో ఉంది. అయితే ప్రసాద్ ఐమాక్స్ లెక్క వేరుగా ఉంటుంది. తాము 47.5% ముంచుకుని బయ్యర్ లేదా డిస్ట్రిబ్యూటర్ కు 52.5 % ఇస్తుంది.. అంటే పివిఆర్ / ఐనాక్స్ కంటే 2.5% తక్కువ ఇస్తుంది. పుష్ప 2 దగ్గర ఇదే గొడవ మొదలైంది. 55 % ఇస్తేనే సినిమా ఇస్తామని మైత్రీ వాళ్ళు పట్టుబట్టగా ఇవ్వకపోతే ఇవ్వొద్దు అని ప్రసాద్ వాళ్ళు ప్రదర్శించలేదు. ఈ పంచాయితీ ఇక్కడితో ఆగలేదు ప్రసాద్ ఐమాక్స్ అధినేత ఈ విషయాన్ని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.. దీని మీద చర్చలు మొదలయ్యాయి.ఇకపై పివిఆర్ / ఐనాక్స్ కూడా 52.5 % మాత్రమే ఇవ్వాలని తీర్మానం చేస్తే మైత్రి సంస్థ అనవసరంగా చిక్కుల్లో పడినట్టు అవుతుంది. పుష్ప అంటే క్రేజ్ మీద లాగేసింది. ఈ నెలలోనే మైత్రి సంస్థ రాబిన్ హుడ్ విడుదలవుతోంది. ఈ సినిమాను 52.5 % షేర్ మీద ఇవ్వటానికి మైత్రి ముందుకు వస్తేనే తగ్గినట్లు అవుతుంది.. లేదా ప్రసాద్ యాజమాన్యం తాము రాబిన్‌హుడ్ సినిమాను వేయను అని పట్టుబడితే ఆ సినిమాకు పెద్ద నష్టం జరుగుతుంది. పుష్ప 2కు మైత్రీ వెనక్కు తగ్గలేదు.. అదే రాబిన్ హుడ్ కు అలా పట్టుబడితే నితిన్ సినిమా నిండా మునిగినట్టే. మొత్తం మీద ఈ పంచాయితీ ఎక్కడ మునిగి ఎక్కడ తేలుతుందో చూడాలి.