టాలీవుడ్ లో ఈ వారం థియేటర్లలో విడుదలవుతున్న ఒకే ఒక భారీ బడ్జెట్ సినిమా పుష్ప ది రూల్. మరో కొద్ది గంటల్లో పుష్ప 2 ప్రీమియర్లు థియేటర్లలో పడిపోనున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రు. 1000 కోట్ల ప్రి రిలీజ్ చేసింది. సినిమా అయితే అంచనాలు మామూలుగా లేవు. ఇప్పటికే నైజాంలో టిక్కెట్ రేట్లు ఫిక్స్ అయిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అలా ఓపెన్ అయ్యాయో లేదో దూసుకుపోతున్నాయి.అయితే ఏపీలో మాత్రం ఇంకా టిక్కెట్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. రేపు రాత్రి సెకండ్ షో 9.30 గంటల నుంచే పుష్ప షోలు వేసేయాలి.. అయితే ఇంకా టిక్కెట్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడంతో ప్రేక్షకుల్లోను.. ఇటు బన్నీ అభిమానుల్లోనూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఏపీలోనూ టిక్కెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వం అధికారికంగానే జీవో ఇచ్చేసింది. ఇక బుకింగ్స్ ప్రారంభించడమే తరువాయిపుష్ప 2 అయితే 475 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. దీనికి బన్నీ రెమ్యునరేషన్ రు. 240 కోట్లు అదనం. అన్నీ ఉన్నా కూడా ఏపీలో ఇంకా బుకింగ్స్ ఎందుకు ప్రారంభించలేదో అన్న చర్చ అయితే నడుస్తోంది. ఇదిలా ఉంటే పుష్ప ది రూల్ రిలీజ్ సమయంలో నాగబాబు చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మీరు తప్పు మార్గంలో వెళ్తుంటే వెంటనే మీ తప్పును సరిదిద్దుకోవాలని మీరు తప్పు మార్గంలోనే కొనసాగితే మాత్రం మీరు నిజంగా ఉన్న చోటికి తిరిగి రావడం కష్టమవుతుందన్న కామెంట్ బన్నీ పుష్ప 2 సినిమాను ఉద్దేశించే అంటున్నారు.. మరి ఇందులో నిజం ఏంటో వారికే తెలియాలి.