Moviesనైజాం... ఆంధ్రా ప్లేస్ ఏదైనా పుష్ప గాడి రూల్ త‌గ్గేదేలే... !

నైజాం… ఆంధ్రా ప్లేస్ ఏదైనా పుష్ప గాడి రూల్ త‌గ్గేదేలే… !

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న పుష్ప 2 సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాపై ఒక రేంజ్ లో బజ్‌ నడుస్తోంది. నైజాంలో టికెట్ రేట్లకు పెంపు విషయంలో గేట్లు బార్ల తెరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీలో కూడా అదే రిపీట్ అయింది. తగ్గేదేలే అన్నట్టు తెలంగాణలో టికెట్ రేట్లు పెంచితే.. అసలు తగ్గేదేలే అన్నట్టు ఏపీలో కూడా రేట్లు పెంచేశారు. రెట్టించిన ఉత్సాహంతో స్పెషల్ జీవో కూడా జారీ చేశారు. ఏపీలో టాలీవుడ్ సినిమా చరిత్రలో ఇదే హైయెస్ట్ రేట్ కావటం విశేషం. నైజాంలో ఇచ్చినట్టుగా ఏపీలో కూడా నాలుగో తేదీ స్పెషల్ ప్రీమియర్లకు ప్రత్యేక అనుమతులు ఇచ్చారు.ఆ ఒక్క షోకు టికెట్ రేటు 800 రూపాయలు చేశారు. ఇది నాలుగో తేదీ రాత్రి 9.30 గంటలకు ఉంటుంది. ఇక నైజంలో ఐదవ తేదీ నుంచి ఫ్లాట్ టికెట్ రేట్లు పెంచితే.. ఏపీలో మాత్రం స్లాబ్ సిస్టం పెట్టారు. ఐదవ తేదీన ఆరు షోలకు అనుమతి ఇస్తూనే లోయర్ క్లాస్‌కు వంద రూపాయలు .. అప్పర్ క్లాస్ కు 150 రూపాయలు… మల్టీప్లెక్స్ లలో 200 రూపాయల వరకు పెంచుకోవచ్చని జీవో ఇచ్చారు. ఇక ఆరవ తేదీ నుంచి 17వ తేదీ వరకు రోజుకు 5 షోలకు అనుమతి ఇచ్చారు. ఇక్కడ కూడా పైన చెప్పుకున్న టిక్కెట్ రేట్లు ఉంచుకోవచ్చు. అయితే నైజం లో మాత్రం ఏకంగా 19 రోజులు పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు రాగా.. ఏపీలో వరుసగా 13 రోజులు రేట్లు పెంచుకోవచ్చని చెప్పారుఆంధ్రప్రదేశ్లో ఓ సినిమాకు ఈ స్థాయిలో టికెట్లు పెంపుపై ప్రత్యేక అనుమతి ఇవ్వటం ఇదే తొలిసారి. ఇంతకుముందు రిలీజ్ అయిన పెద్ద సినిమాలు టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి – యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవరతో పోలిస్తే పుష్ప 2 కు భారీగా రిలాక్సేషన్ ఇచ్చినట్లయింది. మరి ముఖ్యంగా బెనిఫిట్ షో విషయంలో తగ్గేదేలే అన్నట్టు ఏపీ ప్రభుత్వం వ్యవహరించింది. దీనిపై టాలీవుడ్ వర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news