Moviesమోక్ష‌జ్ఞ రెండో సినిమా ద‌ర్శ‌కుడు ఫిక్స్ వెన‌క ఏం జ‌రిగింది..?

మోక్ష‌జ్ఞ రెండో సినిమా ద‌ర్శ‌కుడు ఫిక్స్ వెన‌క ఏం జ‌రిగింది..?

నందమూరి నట‌సింహం బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమా ఎట్టకేలకు పట్టాలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ యేడాది సంక్రాంతికి పాన్ ఇండియా రేంజ్‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడి ద‌ర్శ‌క‌త్వంలో మోక్షు తొలి సినిమా ఫిక్స్ అయ్యింది. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మోక్షజ్ఞ రెండో సినిమాపై క్లారిటీ వచ్చింది. రెండో సినిమా దర్శకుడు ఎవరు ? అన్నది కూడా తేలిపోయింది.Nandamuri Mokshagnya Showcases Charisma & Confidence In New Stillతాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా దర్శకుడు వెంకీ అట్లూరి తెర‌కెక్కించిన లక్కీ భాస్కర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో వెంకీ అట్లూరి – మోక్షజ్ఞ కలయికలో రెండో సినిమా సెట్ అయ్యిందట. ఇప్పటికే మోక్షజ్ఞ కోసం.. వెంకీ అట్లూరి ఒక కథ కూడా రాసినట్టు తెలుస్తోంది. పైగా ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించబోతుంది. ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా నందమూరి అభిమానులు ఆనందం మాత్రం మామూలుగా లేదు.నందమూరి వారసుడొచ్చాడు... మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ విడుదల - Mana Telangana

ఏది ఏమైనా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై ఐదారు సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచేలా నందమూరి అభిమానులు.. తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు. ఎట్టకేలకు మోక్షజ్ఞ తొలి సినిమా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అలా సెట్స్ మీదకు వెళ్ళిందో లేదో వెంటనే మోక్షజ్ఞ రెండో సినిమా దర్శకుడు … సినిమా నిర్మించే బ్యానర్ కూడా దాదాపు ఖ‌రారు కావటం నందమూరి అభిమానులలో ఎక్కడా లేని జోష్ నింపుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news