టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక హీరోయిన్గా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా పుష్ప 2. మూడేళ్ల నుంచి ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా.. మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి వచ్చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమాపై కనివిని.. ఎరుగని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 సినిమాకు మొత్తం వెయ్యి కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిందని చెబుతున్నారు.
ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా.. సోషియో ఫాంటసీ సినిమా కాకుండా.. మల్టీ స్టారర్ కాకుండా.. ఒక మామూలు కమర్షియల్ వాల్యూస్‌తో తెరకెక్కిన పుష్ప 2 సినిమాకు.. రూ.1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే మామూలు సంచలనం కాదు అని చెప్పాలి. ఇక పుష్ప 2 రెండు తెలుగు రాష్ట్రాలు అంటే.. ఆంధ్ర, సీడెడ్, నైజాం కలిపి ఎంత వసూలు సాధించాల్సి ఉంటుంది అన్నది ఆసక్తికరం. ఆంధ్రాలో రూ.90 కోట్లు, నైజంలో రూ.100 కోట్లు, సీడెడ్‌లో రూ.30 కోట్లకు పుష్ప 2 సినిమాను బయ్యర్లకు అమ్మారు.
18% జిఎస్టి ఉంటుంది. థియేటర్ల ఖర్చులు, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు.. 20 శాతం కమీషన్‌గా తీసివేస్తే.. మొత్తం రూ.220 కోట్లు రావాల్సి ఉంటుంది. అంటే.. కేవలం ఏపీ, తెలంగాణలో ఈ సినిమా రూ.450 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబడితేనే అందరూ సేఫ్ అవుతారు. ఇది చాలా పెద్ద టార్గెట్. బాహుబలి, త్రిబుల్ ఆర్ రేంజ్ స్థాయిలో ఈ సినిమాకు కలెక్షన్లు రావాలి. అయితే పుష్ప 1తో పోలిస్తే రేట్లు డబుల్ అయ్యాయి. మరి సినిమాకు సూపర్ హిట్ టాక్ రావాలి. కనీసం 20 రోజులు పాటు హౌస్ ఫుల్స్ పడాలి.