Moviesఅఖిల్ పెళ్లిపై కొత్త పుకారు.. ఖండించిన నాగార్జున‌...!

అఖిల్ పెళ్లిపై కొత్త పుకారు.. ఖండించిన నాగార్జున‌…!

ఒకవైపు అంతా నాగచైతన్య పెళ్లిపై ఫోకస్ చేస్తున్న వేళ‌.. అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్ చాలా సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందర్నీ తన వైపునకు ఆకర్షించాడు. అఖిల్ జైనాబ్ ర‌వ్జ్‌దేతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అఖిల పెళ్లిపై కొత్త‌ పుకారు చెల‌రేగింది. డిసెంబర్ 4 నాగచైతన్య – హీరోయిన్ శోభిత పెళ్లి తో పాటు అఖిల్ – జనాబ్ ర‌వ్జ్‌దే వెళ్లి కూడా చేయబోతున్నారని.. ఒకే వేదికపై ఇద్దరు కొడుకులు పెళ్ళిళ్లను నాగార్జున జరిపించబోతున్నారని ప్రచారం మొదలైంది. అమ‌ల ప‌ట్టుబ‌ట్టి మ‌రీ చైతు పెళ్లితో పాటు త‌న కుమారుడు అఖిల్ పెళ్లి కోసం ప‌ట్టుబ‌ట్టింద‌ని.. అందుకే అఖిల్‌కు ఇంత సైలెంట్‌గా… త్వ‌ర‌గా.. అందులోనూ మ‌ళ్లీ అఖిల్ కంటే వ‌య‌స్సులో పెద్ద అమ్మాయితో పెళ్లి చేస్తున్నారంటూ ఒక్క‌టే ప్ర‌చారం న‌డిచింది.Akhil Akkineni-Shriya Bhupal's wedding called off: Were compatibility  issues to blame? – Firstpost

ఇంత హడావుడిగా చిన్న కొడుకుకి సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేయడానికి కారణం కూడా డిసెంబర్ 4న ఒకేసారి ఇద్దరు పెళ్లిళ్లు చేయడానికే అంటూ ఒకసారిగా ప్రచారం మొదలైంది. వీటిని నాగార్జున ఖండించాడు. డిసెంబ‌ర్ 4న కేవ‌లం చైతు – శోభిత పెళ్లి మాత్రమే జ‌రుగుతుంద‌ని.. అదే రోజు అఖిల్ పెళ్లి ఉందంటూ వ‌స్తోన్న వార్త‌లు అన్నీ పుకార్లే అని తేల్చిచెప్పాడు. ఇక ముందుగా చైతు పెళ్లి అయ్యాక వ‌చ్చే యేడాది సంక్రాంతి త‌ర్వాత అఖిల్ పెళ్లి జైనాబ్‌తో ఉండే అవ‌కాశం ఉంది. ఇక ప్ర‌స్తుతంసోష‌ల్ మీడియా అంతా అఖిల్‌కు కాబోయే భార్య జైనాబ్ ఎవ‌రు ? అన్న దానిమీదే ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news