ప్రస్తుతం ఇండియాలో పుష్ప 2 మేనియా నడుస్తోంది. ఇటు కన్యాకుమారి నుంచి అటు కాశ్మీర్ వరకు ఎవరి నోట విన్నాం పుష్ప 2 నామస్మరణతో దేశం అంతా మారుమోగుతుంది. రాజమౌళి ప్రభాస్ తో బాహుబలి సినిమా చేసిన తర్వాత తెలుగు సినిమా స్థాయి భారతదేశమంతా పాకేసింది. ఆ తర్వాత తెలుగు సినిమా అంటే పాన్ ఇండియా సినిమా అయిపోయింది. ఇప్పుడు ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా అవతరించాడు. అయితే రాజమౌళి సినిమా లేకుండా … ఏ ఇతర పాన్ ఇండియా సినిమా చేయకుండానే మొదటి పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు బన్నీ. ఈ రికార్డు బన్నీ ఇదే 2009 టైం లోనే అల్లు అర్జున్‌కు హిందీ బెల్ట్ తో పాటు కేరళలో విపరీతమైన క్రేజ్ ఉంది.
అల్లు అర్జున్ ఎంత గ్రేట్ అంటే ఒక ఫాంటసి గ్రాఫిక్స్ సినిమా కాకపోయినా ఒక పక్కా మాస్ కమర్షియల్ సినిమాతో పైగా తన సినిమాలో మరో హీరో లేకుండా మల్టీస్టారర్ సినిమా కాకుండా సింగల్ హ్యాండ్ తో వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి అదిరిపోయే రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. రేపటి రోజున పుష్ప 2 రు. 1000 కోట్ల గ్రూపులోకి అడుగుపెట్టడం చాలా ఈజీ అని ఇండియన్ సినిమా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బన్నీకి బీహార్లు ఏర్పడిన క్రేజ్ చూస్తే ఏ ఇతర బాలీవుడ్ – టాలీవుడ్ – టాలీవుడ్ హీరో కూడా అందుకోలేరేమో అనిపిస్తుంది.
ఇదంతా పక్కన పెడితే పుష్ప 2 సినిమా కోసం బన్నీ తీసుకున్న రేమ్యూనరేషన్తో ఇండియాలోని హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గా అవతరించాడు. పుష్ప 2 కోసం బన్నీకి రు. 300 కోట్ల రెమ్యునరేషన్ దక్కినట్టు టాక్ ? ఈ దెబ్బతో బన్నీ టాప్ వన్ లోకి రావడంతో టాప్ 5 నుంచి ప్రభాస్ అవుట్ అయిపోయాడు. టాప్ వన్ లో బన్నీ ఉంటే రెండో స్థానంలో తమిళ స్టార్ట్ హీరో దళపతి విజయ్.. మూడో స్థానంలో షారుఖ్ ఖాన్ నాలుగో స్థానంలో రజనీకాంత్… 5 స్థానంలో అమీర్ ఖాన్ ఉన్నారు.