ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ అనేది బాగా పాపులర్ అవుతోంది. గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఇది బాగా పాపులర్ అవుతుంది. ప్రతి ఒక్క హీరోయిన్ చాలా ధైర్యంగా తాము ఎదుర్కొన్న వేధింపులు తమను లైంగిక వేధింపుల విషయంలో ఎవరెవరు ఎలా ఇబ్బందులు ? పెట్టారు ఓపెన్ గానే చెబుతున్నారు. అలా కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసిన కొందరు నటీమణుల గురించి తెలుసుకుందాం.
దివ్యంగా త్రిపాఠి :
దివ్యాంగ త్రిపాఠి ఒక దర్శకుడు అవకాశం కోసం తనను లైంగికంగా వాడుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు.
ఆషా నేగి :
ఆషా నేగి 20 ఏళ్ళ వయసులో కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్నట్టు చెప్పింది.
జాస్మిన్ భాసిన్ :
జాస్మిన్ భాసిన్ ఒక దర్శకుడు అవకాశం కోసం దుస్తులను తీసివేయమని చెప్పినట్టు ఆరోపించింది.
రష్మీ దేశాయ్ :
రష్మీ దేశాయ్ పదహారేళ్ళ వయసులో తాను క్యాస్టింగ్ ఎదుర్కొన్నట్టు వెల్లడించారు.. తాను చాలా సార్లు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు క్యాస్టింగ్ సమస్య ఎదుర్కొన్నానని చెప్పారు.
మహి విజ్ :
మహి విజయ్ తనకు కెరీర్ ప్రారంభంలోనే క్యాస్టింగ్ సమస్య ఎదుర్కొన్నట్టు తెలిపారు.
ఉర్ఫీ జావెద్ :
సోషల్ మీడియా సంచలనం ఉర్ఫీ జావెద్ ఓ దర్శకుడు అడిషన్లో తనను కౌగిలించుకోమని చెప్పాడని ఆరోపించారు.
సింగర్ చిన్మయి :
వీరితోపాటు తమిళ స్టార్ సింగర్ చిన్మయి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి – విద్యాబాలన్ అలాగే తెలుగులో శ్రీరెడ్డి లాంటివాళ్ళు క్యాస్టింగ్ కౌచ్ విషయంలో తాము చాలా ఇబ్బందులు పడినట్లు చెప్పారు. అలాగే తెలుగు హీరోయిన్ మాధవీలత ఓ దర్శకుడు తనను అవకాశాల పేరుతో ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేశాడని ఆరోపించారు.