ప్రస్తుతం కోలీవుడ్ హీరో ధనుష్‌ను వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. స్టార్ హీరోయిన్ నయనతార ధనుష్ పై బహిరంగ లేఖాస్త్రం సంధించి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ధనుష్ గతంలో కూడా కొందరికి హీరోయిన్లను చాలా ఇబ్బందులు పెట్టిన వార్తలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ గురించి వెబ్ చాట్ ఛానల్ కి చెందిన అనంతరన్ ఓ సంచలన విషయం బయట పెట్టారు. కీర్తి సురేష్ ని ధనుష్ దాదాపు మూడు రోజులు చిత్రహింసలు పెట్టారని ఆయన చెప్పిన మాటలు వింటే అందరికీ షాకింగ్ అనిపిస్తున్నాయి. కీర్తి సురేష్ – ధనుష్ కాంబినేషన్లో రైలు మూవీ వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకి ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించారు. సినిమా తెరకెక్కించే సమయంలో ధనుష్ కీర్తి సురేష్ ని ఏదో చేయమని అడగగా అందుకు కీర్తి సురేష్ నిరాకరించిందట. పగబట్టిన ధనుష్ కీర్తి సురేష్‌ను దాదాపు 3 రోజులు చిత్రహింసలు పెట్టారట. వర్క్ పరంగా ఆయన పెట్టే స్ట్రెస్ భరించడానికి కీర్తి సురేష్ మూడు రోజులపాటు సినిమాలో సరిగా నటించలేదట. కేవలం ఒక షాట్ తీయడం కోసమే మూడు రోజుల సమయం పట్టిందట. రైల్ సినిమాలో ఎక్కువ శాతం షూటింగ్ రైలు మీద జరిగింది.. ఆ సమయంలో ధనుష్ పెట్టిన టార్చర్ కి షూటింగ్ సరిగ్గా చేయకపోవడంతో ఎక్కువ రోజులు షూట్ చేయాల్సి వచ్చేదట.
ధనుష్ పెట్టే టార్చర్ భరించడానికి కీర్తి సురేష్ ఒకరోజు తన తండ్రికి కాల్ చేసి మరి ఏడుస్తూ ఈ విషయం చెప్పిందట. ఇక కీర్తి సురేష్ తండ్రి అయిన నిర్మాత కుమార్ హీరో రజనీకాంత్ కు చాలా సన్నిహితుడు. ఇలా తన కూతురు ఏడుస్తూ ఫోన్ చేసిందన్న విషయాన్ని రజనీకాంత్ కు చెప్పాడట. వెంటనే రజినీకాంత్ ధనుష్‌కు ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తున్నావో ? నీకు అర్థం అవుతుందా అని వార్నింగ్ ఇవ్వడంతో అయినా కూడా ధనుష్ రజనీకాంత్ మాటలను అంతగా పట్టించుకోలేదట. ఈ విషయాన్ని అనంతన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పి సంచలన సృష్టించాడు. ఇప్పుడు ఈ విషయం వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు ధనుష్ నిజస్వరూపం ఒక్కొక్కటిగా బయటపడుతుందని కామెంట్లు చేస్తున్నారు.