నందమూరి నటసింహ బాలకృష్ణ – విజయశాంతి కాంబినేషన్ అంటేనే తిరుగులేని క్రేజ్ ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ ఒకప్పుడు టాలీవుడ్ లో తిరిగిలేని క్రేజ్ తెచ్చుకునేది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే చాలు తెలుగు సినీ ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురు చూస్తూ థియేటర్ల దగ్గర క్యూ కట్టేవారు. వీరి కాంబినేన్లో మొత్తం 17 సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో ముందుగా కథానాయకుడు సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత డి. రామానాయుడు నిర్మించారు.రెండో సినిమాగా పట్టాభిషేకం ప్లాప్ అయ్యింది. మూడో సినిమాలో వచ్చిన ముద్దుల కృష్ణయ్య సూపర్ హిట్.. నాలుగో సినిమా దేశోద్ధారకుడు యావరేజ్ మూవీ.. ఐదో సినిమా అపూర్వ సహోదరులు సూపర్ హిట్.. ఆరో సినిమాగా భార్గవరాముడు సూపర్ హిట్ అయింది. ఏడో సినిమాగా వచ్చిన సాహస సామ్రాట్ డిజాస్టర్ అయింది. ఎనిమిదో సినిమాగా వచ్చిన మువ్వగోపాలుడు సూపర్ హిట్.. తొమ్మిదో సినిమాగా వచ్చిన భానుమతి గారి మనవడు సినిమా మంచి విజయం అందుకుంది. మీరు కాంబినేషన్ వచ్చిన పదో సినిమా ఇన్స్పెక్టర్ ప్రతాప్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.11వ సినిమా భలే దొంగ సూపర్ హిట్ కాగా .. 12వ సినిమా ముద్దుల మామయ్య బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 13వ సినిమా ముద్దుల మేనల్లుడు కూడా సూపర్ హిట్. ఇక 14వ సినిమా లారీ డ్రైవర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 15వ సినిమా తల్లిదండ్రులు సూపర్ హిట్.. 16వ సినిమాగా రౌడీ ఇన్స్పెక్టర్ వచ్చింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక వీరి కాంబోలో ఆఖరి సినిమాగా నిప్పురవ్వ సినిమా వచ్చి బాక్సాఫీస్ దగ్గర మంచి సినిమాగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. అలా బాలయ్య — విజయశాంతి కాంబోలో మొత్తం 17 సినిమాలు వచ్చాయి. ఇందులో ఎక్కువ సినిమాలు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాయి.