పుష్ప 2 ట్రైలర్ వచ్చింది. టాలీవుడ్ జేజేలు పలుకుతోంది.. చాలామంది హీరోలు చివరకు బాలయ్య లాంటి హీరోలు .. శర్వానంద్ లాంటి కుర్ర హీరోలు నాగ వంశీ తదితర నిర్మాతలు ఇలా అన్ని వైపుల నుంచి పుష్ప 2 ట్రైలర్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.. కానీ మెగా కాంపౌండ్ నుంచి చిన్న చప్పుడు కూడా లేదు. మెగాస్టార్ అందరివాడు చిన్నచిన్న విషయాలకు అతీతం. మరి ఆయన కూడా అద్భుతంగా జరిగిన పాట్నా ఈవెంట్.. అనంతరం ట్రైలర్ గురించి ఒక చిన్న ట్విట్ వేసి ఉంటే బాగుండేది. చిరంజీవి అలా చేసి ఉంటే మిగిలిన మెగా హీరోలు అందరూ అలా ఫాలో అయ్యే వారేమో.. పోనీ వాళ్లంతా ఎప్పుడు ఏ సినిమాకు మద్దతు ఇవ్వలేదా ? సపోర్ట్ చేయలేదా ? అంటే ప్రతి సినిమా విడుదలకు ముందు విష్ చెప్పే మెగా హీరోలు కూడా ఇప్పుడు మాత్రం మౌనంగా ఉన్నారు.
అంటే రచ్చ గెలిచిన బన్నీ ఇప్పుడు మెగా అంటే మాత్రం ఒంటరి అనుకోవాలా ? అయినా బన్నీకి ఏం అవ్వదు .. ఏ మాత్రం ఫరక్ పడదు… ఎందుకంటే మెగా కాంపౌండ్ హీరోగానే బన్నీ సినిమాల్లోకి ఎంటర్ అయి ఉండవచ్చు.. కానీ ఎదిగిన క్రమం చూస్తే తన బలం.. తన సత్తా తన ప్లానింగ్ తోనే పుష్ప 2 సినిమా కేవలం సుకుమార్ సినిమాగా చూడలేము. బన్నీ కేవలం ఆ సినిమాకి హీరో మాత్రమే కాదు.. పుష్ప 2 ఎలా ఉండాలి ? అన్నది అడుగు అడుగు.. ఇంచు ఇంచు చూసుకుంటూ వస్తున్నాడు.
చాలా ప్లానింగ్ చేసుకుంటూ వెళుతున్నాడు.. అందువల్ల ఇప్పుడు ఎవరు మెచ్చుకున్నా ? ఎవరు మెచ్చుకోకపోయినా బన్నీకి పోయేదేమీ లేదు. ప్రపంచం అంతా జేజేలు పలుకుతున్న వేళ సొంత ఇంటి మనుషులు శభాష్ అని ఓ మాట అనకపోతే కొంచెం బాధగా ఉండొచ్చు… చూసే వాళ్లకు కాస్త వెలితిగా ఉండవచ్చు… అయితే ప్రపంచం మొత్తం బన్నీకి ఇప్పుడు జేజేలు పలుకుతోంది. బన్నీని ఓ పోరాట యోధుడిగా చూస్తోంది.