Moviesఏఆర్‌. రెహ్మ‌న్ శిష్యురాలు విడాకులు... వీరిద్ద‌రికి లింక్ ఉందా..?

ఏఆర్‌. రెహ్మ‌న్ శిష్యురాలు విడాకులు… వీరిద్ద‌రికి లింక్ ఉందా..?

దిగ్గజ‌ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ విడాకులు తీసుకున్నాడు. రెహమాన్ తన భార్య సైరా భాను నుంచి విడాకులు తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం ఇదంతా జరిగింది. 29 సంవత్సరాలపాటు కలిసి కాపురం చేసి ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు అయిన ఈ జంట విడిపోవడం దేశవ్యాప్తంగా అందరికీ షాక్ ఇచ్చింది. విచిత్రం ఏమిటంటే రెహమాన్ విడాకులు తీసుకున్న కొన్ని గంటల్లోనే రెహమాన్ దగ్గర పనిచేస్తున్న శిష్యురాలు కూడా భర్తకు విడాకులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.రెహమాన్ – సైరా భాను మధ్య ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన ఇబ్బందులు పెద్ద అంతరాయం సృష్టించాయని సైరా భాను లాయర్ వందన షా పేర్కొన్నారు. రెహమాన్ – సైరా దంపతులకు ఉన్న ముగ్గురు పిల్లలలో ఇద్దరు కుమార్తెలు ఖ‌తీజా – రహీమా కాగా అమీన్ రెహమాన్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే రెహమాన్ దగ్గర బాషిష్టుగా పనిచేస్తున్న లేడీ అసిస్టెంట్ మోహిని డే కూడా మంగళవారం సాయంత్ర‌మే తన భర్తకు విడాకులు ఇచ్చింది.ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. విడిపోయినప్పటికీ భర్తతో కలిసి ప్రోగ్రాంలు చేస్తానని మోహిని క్లారిటీ ఇచ్చింది. అయితే గంటల వ్యవధిలోనే రెహమాన్ .. అతడి సహాయకురాలు వేరువేరుగా విడాకులు తీసుకోవడం ప్రస్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య ఏదైనా లింకు ఉందా ? అందుకే ఒకేసారి విడాకులు తీసుకున్నారా అన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news