టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. వరుసగా ఏడు సూపర్ హిట్ సినిమాలు కూడా ఎన్టీఆర్ ఖాతాలో వరుసగా వచ్చాయి. ఇక 2015లో వచ్చిన టెంపర్ సినిమా నుంచి ఎన్టీఆర్ కెరీర్ లో అసలు అపజయం అన్నదే లేకుండా వరుసగా అన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు వస్తున్నాయి. తాజాగా దేవర సినిమాతో వరుసగా ఏడో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కెరీర్ లో బ్లాక్ అయిన సినిమాలకు భారీ లాభాలు రాగా.. సూపర్ హిట్ అయిన సినిమాకు నష్టాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
వినటానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం. 2013లో దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమా రామయ్య వస్తావయ్య. శృతిహాసన్ – సమంత ఎన్టీఆర్ పక్కన హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంచనాలు అందుకోలేదు. సినిమాకు ప్టాప్ టాక్ వచ్చింది. అయినా ఈ సినిమాకు ఉన్న భారీ హైప్ నేపథ్యంలో లాభాలు వచ్చాయి. గబ్బర్ సింగ్ లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా లాభాలు వచ్చినట్టు నిర్మాత దిల్ రాజు స్వయంగా చెప్పారు.
అయితే బండ్ల గణేష్ నిర్మాతగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సినిమా బాద్ షా. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. అయితే భారీ బడ్జెట్ పెట్టిన కారణంగా సినిమాకు అనుకున్న స్థాయిలో లాభాలు రాలేదు. ఈ విషయంలో దర్శకుడు శ్రీనువైట్ల తప్పేం లేదని.. తానే కావాలని ఎక్కువ ఖర్చు పెట్టానని బండ్ల గణేష్ స్వయంగా చెప్పారు.