తన డాక్యుమెంటరీ విషయంలో కోలీవుడ్ హీరో ధనుష్ తీరును తప్పుపడుతూ నటి నయనతార తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. నానం రౌడీదాం తెలుగులో వచ్చిన నేను రౌడీనే సినిమాను ధనుష్ నిర్మించారు. ఈ సినిమాకు దర్శకుడు విగ్నేష్ శివన్… కాగా నయనతార – విఘ్నేష్ ఈ సినిమా షూటింగ్ టైం లోనే వీరిద్దరూ ప్రేమలో పడి చివరకు పెళ్లి చేసుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి మూడు సెకండ్ల నిడివి ఉన్న ఓ వీడియోను నయనతార తన పెళ్లి డాక్యుమెంటరీ ట్రైలర్ లో వాడుకున్నందుకు రు. 10 కోట్లు నష్టపరిహారంగా ధనుష్ డిమాండ్ చేశారని నయనతార ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ధనుష్ తనకు లీగల్ నోటీసులు పంపించినట్లు కూడా నయనతార రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారి తీసాయి. ఈ నేపథ్యంలోనే నయనతారకు పలువురు సినీ తారల నుంచి మద్దతు లభించింది. ఆమె షేర్ చేసిన స్టేట్మెంట్కు శృతిహాసన్ – ఐశ్వర్య లక్ష్మి – నజ్రియా – ఏకాకపూర్ – దియామీర్జా – శిల్పారావు లైక్ కొట్టి తమ మద్దతు తెలియజేశారు. మలయాళ నటి పార్వతి తిరువొత్తు సెల్యూట్ చేస్తూ నయనతార ధైర్యాన్ని మెచ్చుకున్నారు. స్మృతి కిరణ్ అనే దర్శకురాలు దీనిపై స్పందిస్తూ ఇది చాలా బాధాకరం .. నువ్వు నిజంగానే ఒక స్టార్ మిగిలిన వారు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతారు అని నమ్ముతున్నా అని పేర్కొన్నారు.
నయనతారకు సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోయిన్ల నుంచి మద్దతు లభిస్తుంటేసోషల్ మీడియా వేదికగా ధనుష్‌కు అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. ఒక స్టార్ హీరో గురించి ఈ విధంగా బహిరంగ విమర్శలు చేయటం మంచి పద్ధతి కాదని… వారు ధనుష్‌కు సపోర్ట్ చేస్తున్నారు.. ధనుష్ మర్యాదకు భంగం కలిగించడానికి నయనతార ఇలా చేసిందని వారు దుమ్ము ఎత్తిపోస్తున్నారు. నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకుని నయనతార బియాండ్ ఫెయిరీ టేల్ అని డాక్యుమెంటరీ నెట్లిక్స్ రూపొందించింది. ఇది ఈ నెల 18న రిలీజ్ కానుంది.
ఈ క్రమంలోనే నేను రౌడీనే సినిమాకు సంబంధించి కొన్ని విజువల్స్ ఇందులో వాడుకోవటానికి ధనుష్ అనుమతి ఇవ్వలేదు. దాదాపు రెండేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నా ధనుష్ అనుమతి ఇవ్వలేదు.. చుట్టుపక్కల వారి ఎదుగుదల చూడలేక ధనుష్ ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని నయనతార ఆరోపించడంతోపాటు ద్వేషాన్ని కాదు.. ప్రేమను పంచమని హితవు పలికారు.