బాలీవుడ్లో ప్రేమకథా సినిమాలకు కొదవే లేదు. ఎన్నో ప్రేమకథలు తెరకెక్కి దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల మదిని దోచుకున్నాయి. అలాంటి ప్రేమకథల్లో రాజా హిందుస్తానీ ఒకటి. అమీర్‌ఖాన్ – కరిష్మా కపూర్ జంటగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు ధర్మేష్ దర్శన్ దర్శకత్వం వహించారు. 1996లో రిలీజ్ అయిన ఈ ప్రేమకథ కేవలం బాలీవుడ్‌తో పాటు దేశం మొత్తాన్ని ఉర్రూతలూగించేసింది. తాజాగా ఈ సినిమా 28 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో ఉన్న ముద్దు సీను గురించి కూడా ధర్మేష్ దర్శన్ చెప్పాడు. సినిమా కథలో భాగంగా ఓ ముద్దు సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. కరిష్మా అప్పటకి ఏ సినిమాలోనూ కిస్ సీన్లో చేయలేదు. అందుకే ఆమె చాలా టేక్‌లు తీసుకుంది. కరిష్మాకు ధైర్యం చెప్పేందుకు ఆమె తల్లిని కూడా షూటింగ్ స్పాట్‌కు తీసుకువచ్చి ధైర్యం చెప్పేలా చేశాము.. మొత్తం మూడు రోజుల పాటు షూట్ చేసి 47 రీ టేక్‌లు తీసుకున్నామని ఆయన చెప్పారు.
ఆ రోజుల్లో లిప్‌లాక్ సీన్లు చాలా అరుదు… సినిమా రిలీజ్ అయ్యాక ఆ లిప్ కిస్ సీన్ ఓ ఐకానిక్‌గా నిలిచింది. ఇదే ముద్దు సీన్‌పై గతంలో ఓ సారి కరిష్మా మాట్లాడుతూ ఆ టైంలో తాను ఎంతో అసౌకర్యంగా ఫీల్ అయ్యానని. ఆ సీన్ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూశానని తెలిపారు. ఓ పేదింటి కుర్రాడు.. ధనవంతుల అమ్మాయి ప్రేమలో పడడం… వారు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం.. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయన్న కోణంలో ఈ సినిమా కథ నడుస్తుంది. ఈ సినిమాను తెలుగులో ప్రేమబంధంగా డబ్ అయ్యింది. ఆ రోజుల్లో రు. 5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 76 కోట్లు వసూళ్లు రాబట్టింది.