టాలీవుడ్ యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా దేవర. అరవింద సమేత వీర రాఘవ తర్వాత ఐదున్నర సంవత్సరాలు పాటు ఎన్టీఆర్ గ్యాప్ తీసుకుని సోలో హీరోగా చేసిన సినిమా దేవర. గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే మరోసారి వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కావడంతో దేవరపై భారీ అంచనాలు ఉన్నాయి.సెప్టెంబర్ 27న ప్రేక్షకులు ముందుకు వచ్చిన దేవర తాజాగా ఓటీటీలోకి కూడా విచ్చేసిన సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ లో సౌత్ ఇండియాలోని భాషలలో దేవర అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమా ఓటిటిలోకి వచ్చిన తర్వాత రివర్స్ రెస్పాన్స్ సొంతం చేసుకోవటం విశేషం అని చెప్పాలి. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చాక సినిమాపై రిలీజ్ రోజు ఉన్న మిక్స్డ్ టాక్‌ను మించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఓ రకంగా చెప్పాలంటే ఓటీటీలో ఇది పెద్ద నెగిటివ్ టాక్ అని కూడా చెప్పాలి. ముఖ్యంగా సినిమాలో పలు సన్నివేశాలపై ఈ రకమైన నెగిటివ్ చర్చలు వినిపిస్తున్నాయి. థియేటర్స్ లో అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా రు. 560 కోట్ల గ్రాస్ వసూళ్లు సొంతం చేసుకున్న దేవర ఇప్పుడు ఓటీటీలో కాస్త మిక్స్డ్ టాక్ అందుకోవటం ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. మరి హిందీలోకి వచ్చాక కూడా దేవరకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.