నట కిరీటిగా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న హాస్యనటుడు రాజేంద్రప్రసాద్ కామెడీ కింగ్. అప్పట్లో ఆయన టాలీవుడ్‌ని ఏలిన దశ ఒకటి ఉంది. అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ నటనస్పూర్తితో.. ఆయన సలహాతో.. ఓ కామెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీని ఏలటం అంటే అంత ఈజీ కాదు. ఓవైపు చిరంజీవి, బాలకృష్ణ లాంటి కమర్షియల్ హీరోలు ఉన్నా.. రాజేంద్రప్రసాద్‌కి ప్రత్యేకమైన స్థానం దక్కింది అంటే.. ఆయన ఎంచుకున్న సినిమాలే. కామెడీని నమ్ముకుని వరుసగా సినిమాలు చేసి హిట్లు కొట్టడం అంటే కత్తి మీద సామూలాంటిదే.మహా అయితే ఐదు సినిమాలు.. లేదంటే పది సినిమాలు.. కానీ రాజేంద్రప్రసాద్ హీరోగా చేసిన సినిమాలు 100కి పైగానే ఉన్నాయి. ఎర్రమందారం లాంటి ఛాలెంజింగ్ సినిమా కూడా చేసి రాజేంద్రప్రసాద్ మెప్పించారు. అహనా పెళ్ళంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, మేడమ్ ఇవన్నీ రాజేంద్రుడు కామెడీ చిత్రానికి కేరాఫ్ అడ్రస్. ఆ నలుగురు.. లాంటి సందేశాత్మక సినిమా కూడా ఆయన కెరీర్ లో మర్చిపోలేనిది. రాజేంద్రప్రసాద్ సినిమా కెరీర్లో కూడా.. చిన్న చిన్న మచ్చలు ఉన్నాయి.అప్పట్లో రాజేంద్రప్రసాద్ హీరోయిన్ రజనీ జంటకి మంచి పేరు ఉంది. రజిని అసలు పేరు శశికౌర్ మల్హోత్ర. అయినా తమిళంలో అదే పేరుతో ఇంట్రీ ఇచ్చిన.. తెలుగులో మాత్రం రజనీగా పాపులర్ అయింది. అయితే రజనికి.. రాజేంద్రప్రసాద్ కి మంచి బాండింగ్ ఉంది. ఇద్దరు కొన్నాళ్లు రిలేషన్ లో కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఆ సమయంలో పెళ్లి చేసుకుని ఆలోచన ఉండి కూడా పరిస్థితులు అనుకూలించక ఆమె ఆగిపోయారట. అయితే రజిని అంటే ఎంతో ఇష్టం ఉన్న రాజేంద్రప్రసాద్ ఆమెకు ఆర్థికంగా చాలానే సహాయం చేశారన్న టాక్ కూడా ఉంది. అప్పట్లో ఈ విషయం టాలీవుడ్లో బాగా హైలైట్ అయింది.