అత్తారింటికి దారేది ఈ సినిమా అన్ని రకాలుగా ఓ సంచలనం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చాలా ఏళ్ల తర్వాత తిరుగేలేని సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇంకా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే వసూళ్లు.. కలెక్షన్ పరంగా తిరుగులేని సూపర్ డూపర్ హిట్ సినిమా అత్తారింటికి దారేది. పవన్ కళ్యాణ్ కి జోడిగా సమంత – ప్రణీత హీరోయిన్లుగా నటించారు. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్ కి ముందే సగం యూట్యూబ్లో వచ్చేసినా బాక్సాఫీస్ దగ్గర రు. 100 కోట్ల రాబట్టిన మొదటి సినిమాగా నిలిచింది.
త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పాయింట్ చాలా చిన్నది అయినా ఆ పాయింట్ చుట్టే అన్ని ఎమోషన్స్ నింపేశాడు. మాటలతో మాయ చేసి థియేటర్లలో ఆడియన్స్ ని కట్టిపడేశాడు. హీరోకి మంచి స్టార్ డం తెచ్చి పెట్టాడు. అయితే త్రివిక్రమ్ సినిమాలలో సెకండ్ హీరోయిన్గా నటించిన ఏ హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేదు అన్న అపవాదు ఉంది. ఇది త్రివిక్రమ్ పాలిట పెద్ద బ్యాడ్ సెంటిమెంట్ అయ్యింది. పార్వతీ మెల్టన్ – నిత్యామీనన్ – ప్రణీత – ఈషా రెబ్బ – ని వేదా పేతురాజ్ లాంటి హీరోయిన్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
సినిమా రిలీజ్ అయిన తర్వాత త్రివిక్రమ్ సినిమాలలో సెకండ్ హీరోయిన్లు అడ్రస్ ఉండరు. అలాగే ప్రణీతకు అత్తారింటికి దారేది సినిమాలో పవన్ పక్కన హీరోయిన్గా అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది. పవన్ పక్కన నటిస్తే తన కెరీర్ మారిపోతుందని ఆశలు పెట్టుకుంది. అయితే సినిమా రిలీజ్ అయ్యాక ప్రణీతకు క్రేజ్ రాలేదు.. క్రెడిట్ మొత్తం సమంత కొట్టేసింది. జనాలు పవన్ పక్కన సమంత ఉండగా ప్రణీతను పెద్దగా పట్టించుకోలేదు.. అలా పవన్ పక్కన నటించిన ప్రణీతకు ఏమాత్రం కలిసి రాలేదు.