సీనియర్ నటి ఆమని మన తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా గుర్తు ఉంటుంది.. రీఎంట్రీలో కూడా ఆమె మంచి మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆమని వారసత్వం కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. ఆమని మేనకోడలు హీరోయిన్గా సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. గత ఏడాది కోలీవుడ్ ముద్దుగుమ్మ త్రిషపై సీనియర్ నటుడు మన్సూర్ ఆలీ చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. త్రిష రేప్ సీన్ గురించి మన్సూర్ ఆలీ ఖాన్ చేసిన కామెంట్లపై పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. దీంతో కొందరు సినీ తారలు గతంలో వారికి జరిగిన క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పుతున్నారు.
ఈ క్రమంలో ఆమని కూడా తమిళ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. అప్పట్లో కొందరు తాను నల్లగా ఉంటుందని వంక చెప్పి అవకాశాల కోసం వాళ్లకు కావాల్సింది అడిగేవారట.. మరికొందరు టూ పీస్ బికిని ధరించాలని అడిషన్స్లో అలా టూ పీస్ తో కనిపించాలని ఇబ్బంది పెట్టే వారట. అలాంటి అవకాశాలు వద్దని వదులుకున్నట్టుగా ఆమని చెప్పుకొచ్చింది. అంతే కాదు పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఆమని మళ్లీ నటించాలనుకున్నప్పుడు కొందరు పొట్టపై స్టెచ్ మార్క్స్ ఉన్నాయి చూపించండి అని అడిగారట.
అలాగే తమతో ప్రైవేట్ గా గడపమని అడిగిన దర్శక నిర్మాతలతో పాటు మేనేజర్లు కూడా ఉన్నారని.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ అనేది తప్పకుండా ఉంటుందని ఆమెని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. శుభలగ్నం – శుభసంకల్పం – ఘరానా బుల్లోడు ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఆమని అప్పట్లో దుమ్ము రేపింది.