టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవి లాంటి స్టార్ హీరోస్ అయితే పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేయాలని ఆశపడిన కాలం నుంచి అదే పూరీకి స్టార్ హీరోలు ఎవరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని స్థితికి దిగజారిన పరిస్థితి. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన గత 10 – 12 సినిమాలలో టెంపర్ – ఇస్మార్ట్ శంకర్ రెండు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. పూరి విజయాల శాతం ఎంత దారుణంగా దిగజారిపోయిందో తెలుస్తోంది. లైగర్ సినిమా తర్వాత పూరి ప్రతిష్ట మొత్తం పోయింది. ఇక ఎన్నో ఆశలతో చేసిన డబ్బులు ఇస్మార్ట్ కూడా డిజాస్టర్ అయింది.
ఇప్పుడున్న పరిస్థితులలో పూరి జగన్నాథ్‌తో సినిమా చేసేందుకు మిడిల్ రేంజ్ హీరోలు కూడా ఇష్టపడటం లేదు. వాళ్లు కూడా పూరి చెప్పే కథ వినటానికి ఆసక్తి చూపించడం లేదు.. అలాంటి పూరీ జగన్నాథ్ ఇప్పుడు కాస్త తగ్గి ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాకు అసిస్టెంట్ గా పని చేయబోతున్నాడు. అసిస్టెంట్ అంటే స్పిరిట్ సినిమాకు పూరి జగన్నాథ్ మాటల రచయితగా పనిచేస్తారని గుసగుసలు టాలీవుడ్ వర్గాల్లో ఇరిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా స్పిరిట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికి ఈ కథకు సందీప్ తుదిమెరుగులు దిద్దుతున్నాడు. అయితే ఈసారి స్పిరిట్ డైలాగులు బాధ్యతలను పూరి జగన్నాథ్ కి అప్పగించినట్లు ఫిలిం సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇక్కడ కారణాలు ఏవైనా కావచ్చు.. సందీప్ కి పూరీకి మధ్య స్నేహం అని చెప్పుకోవచ్చు.. కానీ సందీప్ ఎక్కడ ? పూరి ఎక్కడ ? ఒకప్పుడు ఇదే ప్రభాస్ తో వరుసగా రెండు సినిమాలు ( బుజ్జిగాడు – ఏక్ నిరంజన్ ) డైరెక్ట్ చేసిన పూరి ఇప్పుడు అదే ప్రభాస్ సినిమాకు మాటల రచయితగా రాసే స్థాయికి పడిపోవటం అంటే పూరి గ్రాఫ్ ఎలా ?పడిపోయిందో తెలుస్తోంది.