ఏదైనా నేను దిగనంతవరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అంటున్నారు. బాలయ్య ఈ ఏడాది ప్రారంభంలో హిందూపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి రాజకీయంగా తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నారు. అటు రాజకీయాలతో పాటు ఇటు వెండితెరను కూడా షేక్ చేసి పడేస్తున్నారు. అఖండ – వీరసింహారెడ్డి – భగవంత్ కేసరి లాంటి మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలు తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ జోరు పెంచేశారు.
తనతో పాటు దర్శక నిర్మాతలను కూడా బాలయ్య పరుగులు పెట్టేస్తున్నారు. ఒకవైపు బాబి సర్కార్ సీతారామ్ సినిమా సెట్స్ మీద ఉండగానే అఖండ 2 కూడా మొదలుపెట్టేశారు నటసింహం. ఈ రెండిటితో పాటు అన్స్టాపబుల్ షూటింగ్ కూడా నాన్ స్టాప్ గా జరుగుతోంది. ఎంత బిజీగా ఉన్నా కూడా డేట్లు ఏ మాత్రం క్లాష్ లేకుండా బాలయ్య జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక సర్కార్ సీతారామ్ విషయానికి వస్తే ఈ సినిమా టైటిల్పై త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. రాబోయే షెడ్యూల్లో ఇది కూడా పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా వేగంగా జరుగుతుంది.
డిసెంబర్ నుంచి అఖండ 2 సెట్స్ మీదకు వెళుతుంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. అఖండ 2 మొదటి షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు బోయపాటి… అక్కడే భారీ యాక్షన్ సీన్లు షూట్ చేస్తారు. ఇక ఇటు సినిమాలు చేస్తూనే.. అన్స్టాపబుల్కు బ్రేక్ పడకుండా బ్యాలెన్స్ చేస్తున్నారు బాలయ్య. మొత్తానికి సీనియర్ హీరోలలో అందరికంటే చాలా బిజీగా ఉంది ఒక్క బాలయ్య మాత్రమే.