టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో 109వ ప్రాజెక్టుతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు బాబి కొల్లి ఈ సినిమాను డైరెక్టర్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్ అందుకు తగిన ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్ షెడ్యూల్ పూర్తికాగా.. హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా వేసిన సెట్లో రియాక్షన్ సీన్లు షూట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తిచేసి వెంటనే బాలయ్య – బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 షూటింగ్లో జాయిన్ అవుతాడు.ఇక బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న తన 109వ సినిమా టైటిల్‌ను దీపావళి కానుకగా చేస్తారని అందరూ అనుకున్న ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ సినిమాకు సర్కార్ సీతారాం టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. నవంబర్ రెండవ వారంలో సినిమా టైటిల్ టీజర్ అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాత సూర్యదేవరం నాగవంశీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ముందుగా నెట్‌ఫ్లిక్స్‌కు అనుకున్నారు. అయితే దసరా రిలీజ్ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మారు. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేస్తుండడంతో నిర్మాత నాగవంశీ రు. 5 కోట్లు నష్టానికి ఈ డీల్ తిరిగి సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.దీంతో ఎంత గట్టి పోటీ ఉన్నా కూడా సంక్రాంతికే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. బాలయ్య మూడు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాల తర్వాత నటిస్తోన్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.