టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకి – అనిల్ 3 అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు సంక్రాంతి వస్తున్నాం అనే టైటిల్ దాదాపు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారికి ప్రకటన రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో ఫుల్ ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయని దర్శకుడు అనిల్ రావిపూడి సెకండాఫ్ ను కంప్లీట్ గా ప్లాన్ చేశాడని తెలుస్తోంది.
మరి ముఖ్యంగా వెంకటేష్ హీరోయిన్లు ఇద్దరి మధ్యలో వచ్చే కన్ఫ్యూజ్ డ్రామా ఫుల్ ఫన్‌గా సాగుతుందని తెలుస్తోంది. ఎలాగు కామెడీ క్రియేషన్ లో అనిల్ రావిపూడికి ఇప్పటికే మంచి పేరు ఉంది. అందుకే ఈ సినిమాలో కూడా కామెడీ అదిరిపోతుందని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా మీనాక్షి చౌదరి – ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు.
ఇక ఇప్పటికే వెంకీ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్ 2 – ఎఫ్ 3 సినిమాలు రెండూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో హ్యాట్రిక్ పక్కా అన్న ధీమా ఉంది. ఇక బాలయ్యతో భగవంత్ కేసరి లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ఇదే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.