టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస పెట్టి పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆరు నెలల తేడాలో సలార్ – కల్కి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించిన ప్రభాస్ లైన్ ఆఫ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. రాజాసాబ్ – స్పిరిట్ – సలార్ 2 – కల్కి 2 – ఫౌజీ ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్టులు ప్రభాస్ ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్.. సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని తనకు ఇష్టమైన పాటల గురించి పంచుకున్నారు. ఈటీవీలో ప్రసారం అవుతున్న నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమానికి ప్రభాస్ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం రెండో పార్టు వచ్చింది. ఇందులో ప్రభాస్ తన అనుభూతులు పంచుకున్నారు.
సిరివెందుల గారు వెన్ను అలా పెట్టగానే ఇలాంటి గొప్ప పాటలు వచ్చేస్తాయేమో అని .. నిన్నే పెళ్ళాడుతా సినిమాలోని కన్నుల్లో నీ రూపమే పాట అంటే తనకు చాలా ఇష్టమని ప్రభాస్ గుర్తు చేసుకున్నారు.. ఆ పాట చరణం లో వచ్చే లైన్స్ కు తలవంచుకుని నేను తెగ ఎదురు చూశాను.. నేను ఆయనకు చాలా వీరాభిమానిని.. ప్రతి తరానికి సరిపోయేలా పాటల రాయటం సిరివెన్నెల గొప్పతనం… సాహిత్యానికి ప్రాధాన్యం ఉన్న పాటలు రాసిన సిరివెన్నెల గారు శివ సినిమాలో బోటని పాట ముందు లాంటి టీజింగ్ పాట కూడా రాశారు.
శివ సినిమా వచ్చినప్పుడు తను ఐదో తరగతి చదువుతున్నానని… ఎక్కడికి వెళ్లినా ఇదే పాట పాడేవాడిని అని ప్రభాస్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ పాట సిరివెన్నెల గారు రాశారని తెలిసి తాను చాలా ఆశ్చర్యపోయానని.. అప్పట్లో ఇది చాలా పెద్ద సంచలనం సృష్టించింది అని ప్రభాస్ చెప్పారు. చక్రం సినిమాలో జగమంత కుటుంబం… అంకురం సినిమాలో ఎవరో ఒకరు.. ఎప్పుడో ఒకరు పాటలు బాగుంటాయని.. గాయం సినిమాలో నిగ్గదీసి అడుగు పాటలో సమాజంపై ఆయన తపన కనిపిస్తుందని ప్రభాస్ చెప్పారు.