టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ .. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కంప్లీట్ చేస్తాడు. ఆ వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2.. ఆ వెంటనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2 సినిమాలు మధ్యలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా కూడా ఉంటుంది. ఇవన్నీ ఇలా ఉంటే కోలీవుడ్ సీనియర్ దర్శకుడు లోకేష్ కనకరాజ్… ప్రభాస్ తో తన యూనివర్సిల్ సిరీస్ లో భాగంగా ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంతలోనే మరో టాపిక్ కూడా వినిపిస్తోంది. హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టి తన వైపునకు తిప్పుకొని ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం చేస్తున్న ప్రశాంత వర్మ సైతం ప్రభాస్ కోసం ఓ అదిరిపోయే కథ రెడీ చేసి ఇప్పటికే వినిపించినట్లు తెలుస్తోంది.
అదే బ్రహ్మరాక్షసి కథే అనుకుంటున్నారు అయితే ఇదే కథతో ప్రశాంత్ వర్మ గతంలో రణవీర్ సింగ్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నారు. హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక ప్రశాంత్ వర్మ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేశారు. హిందీ స్టార్ హీరో రణవీర్ సింగ్‌కు తాను అనుకున్న బ్రహ్మ రాక్షసి కథచెప్పి మెప్పించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఈ సినిమా అనుకున్నారు. రణవీర్ తో ఫోటోషూట్లు కూడా చేశారు. అంతలోనే ఏమైందో కానీ ఈ సినిమా అధికారికి ప్రకటన రాకుండానే ఆగిపోయింది. ఇప్పుడు ఇదే కథను ప్రశాంత్ వర్మ ప్రభాస్‌కు చెప్పి ఓకే చేయించాడని అంటున్నారు.
ఇందులో కథానాయకుడు పాత్ర కాస్త నెగిటివ్ షేడ్ లో ఉంటుందని టాక్ ప్రభాస్‌కు బాగా సూట్ అవుతుందని అంటున్నారు. అయితే ప్రభాస్ – ప్రశాంత్ వర్మ కాంబినేషన్ ఇప్పట్లో పట్టాలు ఎక్కే పరిస్థితి లేదు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ సినిమా చేస్తున్నారు. ఇందులో కాంతారా ఫేం రిషబ్ శెట్టి హీరో అలాగే తన దర్శకత్వంలో బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసే బాధ్యత కూడా తీసుకున్నాడు. ఇవన్నీ ఎప్పటికీ పూర్తవుతాయో అటు ప్రభాస్ లైన్లో ఉన్న ఐదారు సినిమాలు ఎప్పటికీ పూర్తి అవుతాయో ఆ తర్వాతే అనుకుంటే ఈ బ్రహ్మ రాక్షసి పట్టాలు ఎక్కవచ్చు.