ఇటీవల కాలంలో వేల కోట్లలో సినిమా ఇండస్ట్రీ బిజినెస్ నడుస్తోంది. కేవలం ప్రభాస్ , బన్నీ, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే కాదు.. ఇప్పుడు మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు.. టైర్ 2 హీరోల సినిమాలు కూడా రు. 100 కోట్ల రేంజ్లో ప్రి రిలీజ్ బిజినెస్ జరుపుకుంటున్నాయి. ఇక పెద్ద సినిమాల గ్రాస్ కలెక్షన్లు చూస్తే కళ్లు జిగేల్ మనాల్సిందే. అయితే ఈ సినిమాలకు వందల కోట్లలో కలెక్షన్లు వస్తున్నట్టు నిర్మాతలు .. మేకర్లు పోస్టర్ల మీద పోస్టర్లు వదులుతున్నారు. అయితే అదంతా కేవలం అభిమానులను శాటిస్ పై చేసేందుకు మాత్రమే.
అయితే వాస్తవంగా వసూలు చేసే మొత్తానికి ఫైనల్ గా నిర్మాతకు వెళ్లే మొత్తానికి చాలా తేడా ఉంటుంది. అసలు సినిమాల గ్రాస్ కలెక్షన్లు… నెట్ .. షేర్ చూస్తే నిర్మాతలు లాభ పడి ఉంటారని మనం అనుకోలేం.
ఉదాహరణకు ఒక పెద్ద సినిమా కు రు. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని అనుకుందాం.. అప్పుడు అందులో నుంచి 18 శాతం ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో వెళ్లి పోతుంది.. అంటే 36 కోట్లు పన్ను రూపేనా వెళ్లి పోతుంది… ఇక థియేటర్లకు రెంటల్ కు డబ్బులు ఇవ్వాలి.
థియేటర్ల రెంట్లు మొత్తం గ్రాస్ వసూళ్ల లో 25% పోతాయి.అంటే 50 కోట్లు థియేటర్ల రెంటులకు మిగతా ఖర్చులకు ఇవ్వాల్సి ఉంటుంది.. ఇక్కడికే మొత్తంగా రూ.86 కోట్లు ఇక్కడే పోతాయి. మిగతా రూ.114 కోట్లలో డిస్ట్రిబ్యూటర్లకు షేర్ ఉంటుంది. వాళ్ల షేర్ మొత్తం కలెక్షన్లలో 20 శాతం వరకు ఉంటుంది. అలా చూసుకుంటే ఓవరాల్ గా రు. 25 కోట్లు వాళ్లకు వెళతాయి. అంటే ఫైనల్ గా నిర్మాతల షేర్ వచ్చే సరికి రు. 200 కోట్ల గ్రాస్ వసూళ్లకు సగం అంటే కనీసం రు. 100 కోట్లు కూడా రాదు… రు. 85 – 90 కోట్ల మధ్యలో ఉంటుంది.