Moviesఅల్లు అర్జున్‌కు మిడ్‌నైట్ కాల్ చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌... ఇండ‌స్ట్రీలో ఏం...

అల్లు అర్జున్‌కు మిడ్‌నైట్ కాల్ చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌… ఇండ‌స్ట్రీలో ఏం జ‌రుగుతోంది..!

తెలుగు సినిమా రంగంలో చాలామంది స్నేహితులు ఉంటారు. హీరోలు సినిమాలపరంగా వారి మధ్య ఎంత పోటీ ఉన్నా.. స్నేహంలో చాలా స్పెషల్ గా నిలుస్తూ ఉంటారు. వాళ్లలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. గత నాలుగైదు సంవత్సరాలుగా వీరి మధ్య స్నేహం మరింత బలపడుతూ వస్తుంది. పైగా వీరిద్దరూ ముద్దుగా ఒకరినొకరు బావ, బావ అంటూ పిలుచుకుంటూ ఉంటారు. ఇటీవల కాలంలో వీరి స్నేహం చాలా స్ట్రాంగ్ అవుతుంది.

Allu Arjun Holds Wife Sneha Reddy Close As They Arrive In Delhi For  National Film Awards Ceremony - News18

ఒకరి సినిమాలకు మరొకరు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక‌రి సినిమాలను మరొకరు ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ రావడం మనం చాలా సందర్భాలలో చూసాం. అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాకు అల్లు అర్జున్ సపోర్ట్ చేశాడు. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా సరిగ్గా మిడ్ నైట్ 12 గంటలకు వాళ్లకు ఫోన్ చేసి మరి బర్త్‌డే శుభాకాంక్షలు చెప్తారట. జూనియర్ ఎన్టీఆర్ స్నేహానికి ఎంత విలువ ఇస్తాడో చెప్పక్కర్లేదు.

Jr. NTR And Lakshmi Pranathi's Love Story, From An Arranged Marriage To  Becoming Soulmates

ఈ విషయాన్ని ఒక మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న రాజీవ్ కనకాల సైతం ఎన్నో సందర్భాలలో చెప్పారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ బర్త్ డేకి కూడా జూనియర్ ఎన్టీఆర్ అర్ధరాత్రి వరకు మేలుకొని ఉండి కచ్చితంగా 12 గంటలకు ఫోన్ చేసి మరి బర్త్ డే విషెస్ చెబుతాడట. అల్లు అర్జున్‌కు ముందుగా బర్త్ డే విషెస్ చెప్పేది పక్కనే ఉండే భార్య స్నేహరెడ్డి.. ఆ తర్వాత మొదట విష్ చేసేది ఎన్టీఆర్‌నే కావడం విశేషం. ఇటు అల్లు అర్జున్‌కి కూడా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్‌ను ఎన్నో సందర్భాలలో పొగిడేసాడు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఫ్యామిలీలు కలిసి ఇటీవల కాలంలో ఫ్యామిలీ ఫంక్షన్లు, ప్రవేట్ ఫంక్షన్లు కూడా చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news