Moviesఆ హీరోయిన్‌తో వెంక‌టేష్ రెండో పెళ్లి... రాఖీ క‌ట్టి షాక్ ఇచ్చాడుగా...!

ఆ హీరోయిన్‌తో వెంక‌టేష్ రెండో పెళ్లి… రాఖీ క‌ట్టి షాక్ ఇచ్చాడుగా…!

టాలీవుడ్ లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వెంకటేష్ కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. వెంకటేష్ దగ్గుబాటి నీరజను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలతో పాటు చివరగా వారసుడు జన్మించారు. తన తండ్రి దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినీరంగం లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా నిలదొక్కుకున్నాడు వెంకటేష్. వెంకటేష్ సినిమాల్లోకి వచ్చే స్టార్ హీరోగా కొనసాగుతున్న క్రమంలో ఒక హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ టాలీవుడ్ లో పుకార్లు గుప్పుమన్నాయి.

Jayam Manadera (Original Motion Picture Soundtrack) - EP - Album by  Vandemataram Srinivas, Veturi Sundarama Murthy, Chandrabose & Sirivennela  Sitarama Sastry - Apple Music

ఆ హీరోయిన్ ఎవరో ? కాదు సౌందర్య. వెంకటేష్ – సౌందర్య కాంబినేషన్లో జయం మనదేరా – రాజా – పవిత్ర బంధం – పెళ్లి చేసుకుందాం రా – దేవి పుత్రుడు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు – సూపర్ పోలీసు వంటి సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు రావడంతో పాటు ఆన్ స్క్రీన్ పై వీరి జంటకు ఎంతో మంచి గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి వరుసగా సినిమాలు చేస్తూ ఉండడంతో వెంకటేష్ సౌందర్యని రెండో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి.

Cinema Song Lyric: Pelli Chesukundam telugu movie songs lyrics

సౌందర్యతో వెంకటేష్ క్లోజ్ గా ఉండటం బయట ఈ వార్తలు రావడం చూసిన రామానాయుడు సౌంద‌ర్య‌కు ఒకటే చెప్పారట. ఈ పుకార్లు తగ్గిపోవాలంటే నువ్వు వెంటనే వెళ్లి నా కొడుకుకి రాఖీ కట్టాలి అని చెప్పడంతో సౌందర్య రామానాయుడు చెప్పిన విధంగానే రాఖీ పండుగకు వెళ్లి వెంకటేష్‌కు రాఖీ కట్టిందట. ఈ విషయం అప్పట్లో టాలీవుడ్ లో పెద్ద సెన్సేషన్ అయ్యింది. అలా వెంకటేష్ సౌందర్య పై ఎన్ని పుకార్లు వచ్చిన సౌందర్య రాఖీ కట్టి ఆ పుకార్లకు పులిస్టాప్ పెట్టేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news