Moviesనాన్ థియేట‌ర్ బిజినెస్‌లో చుక్క‌ల‌కెక్కిన ' పుష్ప 2 ' ......

నాన్ థియేట‌ర్ బిజినెస్‌లో చుక్క‌ల‌కెక్కిన ‘ పుష్ప 2 ‘ … బ‌న్నీ ఏంటి బాబు ఈ క్రేజ్‌…!

ప్రస్తుతం టాలీవుడ్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో పుష్ప 2 కూడా ఒకటి. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెర‌కెక్కి మూడు సంవత్సరాలు క్రితం రిలీజ్ అయిన పుష్ప సినిమా ఎలాంటి సంచనాలను నమోదు చేసిందో అందరం చూసాం. బాలీవుడ్లో చాలా సింపుల్గా రిలీజ్ అయిన పుష్ప.. ఫుల్ రన్ లో ఏకంగా రూ.100 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఇండియన్ సినిమా ట్రేడ్ వర్గాలకు దిమ్మతిరిగే మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఎలాంటి ప్రమోషన్లు లేవు. ఎలాంటి అంచనాలు లేవు. కానీ.. పుష్ప సినిమా బాలీవుడ్ లో రూ.100 కోట్ల నికర ఆదాయం రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.

పుష్ప రిలీజైనప్పటి నుంచి భారతదేశ సినీ అభిమానులు అందరూ పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ కానున్న నేపథ్యంలో.. ఈ సినిమా నిర్మాతలు వివిధ ప్రాంతాలలో పుష్ప 2 సినిమాను పంపిణీ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు అందరు కలిపి హైదరాబాదులో మీట్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాతలు పుష్ప 2 నాన్ థియేటర్ బిజినెస్ ఎంత అన్న సీక్రెట్ ను బయట పెట్టేశారు. నాన్ ధియేటర్ ఆదాయం మొత్తం కలిపి రూ.420 కోట్లు అని నిర్మాత నవీన్ ప్రకటించారు.

ఇక థియేటర్ ఆదాయంతో కలిపితే పుష్ప టోటల్ బిజినెస్ రూ.1065 కోట్లు అని తెలుస్తోంది. అంటే పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతోంది. ఇక పుష్పట్టు డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. ముందుగా ఈ సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేయలని అనుకున్నారు. అయితే దర్శకుడు సుకుమార్ సూచనల మేరకు పుష్ప 2 సినిమాను ఒకరోజు ముందుకు జరిపి డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇక ఈ మీట్ కు కర్ణాటక, కేరళ, తమిళనాడు, నార్త్ ఇండియా, నైజాం, వెస్ట్ గోదావరి బయ్యర్లు అందరూ హాజరయ్యారు. సినిమా అనుకున్న దానికంటే ఆలస్యం కావడానికి కారణం బెటర్మెంట్ కోసం అని.. వేరే కారణం లేదని.. నిర్మాత మైత్రి రవి వెల్లడించారు. అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ కూడా ఉంది. ఆ సాంగ్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ శ్రద్ధ కపూర్ బన్నీకి జోడిగా ఆడి పాడబోతుందని తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news