ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్లాదిమంది సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమాలలో పుష్ప 2 ఒకటి. ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మానియా అయితే మొదలైపోయింది. పుష్ప 2 సినిమాకు బన్నీ రెమ్యునరేషన్ ఎంత.. ఈ ప్రశ్నలకు రకరకాల ఆన్సర్లు వినిపిస్తున్నాయి. కొందరు రూ.100 కోట్లు అని.. కాదు రూ.100 కోట్లు ప్లస్ సినిమా ప్రాఫిట్ లో షేర్ అని.. మరికొందరు రూ.150 కోట్లు అని ఇలా రకరకాలుగా చర్చించుకుంటున్నారు ఒక్కటి మాత్రం వాస్తవం. పుష్ప 2 సినిమా కోసం బన్నీ మూడేళ్ల పాటు టైం స్పెండ్ చేశారు.
ఈ టైంలో రెండు సినిమాలు ఈజీగా చేయవచ్చు. కనీసం బన్నీకి ఇప్పుడు ఉన్న క్రేజ్ నేపథ్యంలో రూ.100
కోట్లని లెక్క వేసుకున్న రూ.200 కోట్ల ఆదాయం వస్తుంది. మరి పుష్ప 2 సినిమా మీద ఏకంగా మూడేళ్లు ఉండిపోయాడు. ఇందుకోసం బన్నీకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. సినిమాలో షేర్ తీసుకుంటున్నారట. అంటే టోటల్ సినిమా టర్నోవర్‌లో 27% బన్నీ ఇవ్వాలి.
అంటే ఇప్పుడు పుష్ప 2 సినిమాకు 100 కోట్లకు పైగా గ్రాస్ టర్నోవర్ చేసింది. ఈ లెక్కను చూస్తే బన్నీకి రూ.270 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సినిమా నిర్మాణానికి రూ.500 కోట్ల వరకు ఖర్చయి ఉంటుందని అంచనా. ఖర్చులు పోను బన్నీ షేర్ పోగా మిగిలిన దాంట్లో దర్శకుడు సుకుమార్‌కి కూడా షేర్ ఇవ్వాలి. ఆపై మిగిలినది నిర్మాతలకు లాభం. ఈ సంగతి ఎలా ఉన్నా మూడేళ్ళపాటు శ్రమపడి ఒక సినిమా చేయటం చాలా గొప్ప విషయం.దీంతో పాటు కేవలం బన్నీ తన మేనరిజంతో హైప్ క్రియేట్ చేసినందుకు పుష్ప అనే బ్రాండ్ క్రియేట్ చేసినందు వల్ల ఏకంగా ఈ సినిమాకు ఒక వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. ఇంత కష్టపడినందుకు బన్నీకి వచ్చిన ఆదాయం రూ.270 కోట్లు. బన్నీకి జోడిగా అందాల ముద్దుగా రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు.