Moviesఅన్ స్టాపబుల్ షోలో సూర్య .. రాను రాను అంటున్న రప్పించింది...

అన్ స్టాపబుల్ షోలో సూర్య .. రాను రాను అంటున్న రప్పించింది ఆయనేనా ? బాలయ్యతో రచ్చ రచ్చే..!

ప్రస్తుతం ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో ఎక్కడ చూసినా సరే బాలయ్య హోష్టిగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో గురించి వినిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం బాలయ్య చిన్న కూతురు తేజస్విని… అలాగే బాలయ్య వాక్చాతుర్యము అని చెప్పాలి. ఇప్పుడు దీపావళి కానుకగా అన్ స్టాపబుల్ సీజన్ 4 కూడా ప్రేక్షకులు ముందుకు రానుంది. తొలి ఎపిసోడ్ కు ఏపి సిఎం చంద్ర‌బాబు గెస్ట్ గా వ‌చ్చారు.. ఇప్ప‌టికే బాలయ్యతో చంద్రబాబుకు సంబంధించిన మొదటి ప్రోమో అని కూడా విడుదల చేశారు. అందులో బాలయ్య , చంద్రబాబుని ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు ఆయన జైలు జీవితం గురించి ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ఈ తొలి ఎపిసోడ్ ఈనెల 25న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

NBK అన్‌స్టాపబుల్ షోకు KTR ..? – TV9 Telugu

ఇప్పుడు అన్ స్టాపబుల్ షో కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా ఓ ఎపిసోడ్ కు గెస్ట్ గా రాబోతున్నారని అంటున్నారు. ఇక దీనికి ప్రధాన కారణం సూర్య నటించిన పాన్ ఇండియా మూవీ కొంగువా వచ్చేనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా సూర్య – బాలయ్యతో సందడి చేయబోతున్నారని అంటున్నారు.

Unstoppable 4 | కంగువ ప్ర‌మోష‌న్స్.. 'అన్‌స్టాపబుల్ షో' కు సూర్య-Namasthe  Telangana

బాలయ్యతో సూర్య ఎపిసోడ్ నవంబర్ రెండో వారంలో ఉంటుందని కూడా తెలుస్తుంది. మొదటి వారంలో ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ని మొదలు పెడతారట. అయితే సూర్య ఈ షో కి రావడానికి ప్రధాన కారణం అల్లు అరవింద్ అని తెలుస్తుంది. ఆయనే దగ్గరుండి సూర్యకి కాల్ చేసి షోకి రావాలని అడిగారట. అల్లు అరవింద్ మాట కాదన లేక వస్తానని మాట ఇచ్చారట. బాలయ్య లాంటి లెజెండ్ స్టార్ హీరోతో మరోక స్టార్ హీరో సూర్య ఇంటర్వ్యూ ఇందులో ఎన్ని ఎన్ని విషయాలు బయట పడతాయో అంటూ వాటి కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news