MoviesHBD : ప్ర‌భాస్ 23 సినిమాల క‌లెక్ష‌న్స్ డీటైల్స్ ఇవే...!

HBD : ప్ర‌భాస్ 23 సినిమాల క‌లెక్ష‌న్స్ డీటైల్స్ ఇవే…!

టాలీవుడ్ యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ప్ర‌భాస్ అంటే ఇప్పుడు తెలుగు హీరో మాత్ర‌మే కాదు.. తిరుగులేని పాన్ ఇండియా హీరో.. ప్ర‌భాస్ క్రేజ్ ఏకంగా ఆకాశాన్నంటేసింది. ఇదిలా ఉంటే ఈ రోజు ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌భాస్ న‌టించిన 23 సినిమాల క‌లెక్ష‌న్ల వివ‌రాలు చూద్దాం.

Watch Eswar (Telugu) Full Movie Online | Sun NXT

1) ఈశ్వ‌ర్ :
ప్ర‌భాస్ డెబ్యూ మూవీ ఇది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై కె.అశోక్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు జ‌యంత్ ద‌ర్శ‌కుడు. 2002 టైంలో కోటిన్నర బడ్జెట్ లో తీసిన సినిమా ఇది. బాక్సాఫీస్ వద్ద రూ.2 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. 3 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
2) రాఘవేంద్ర:
ప్రభాస్ హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను శ్రీ శ్రీ చిత్ర బ్యానర్ పై బి.శ్రీనివాస రాజు నిర్మించారు. రూ.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.2.7 కోట్లు రాబట్టింది.

Varsham (2004) - IMDb
3) వర్షం :
ప్రభాస్ – త్రిష జంట‌గా న‌టించిన ఈ సినిమాకు శోభన్ దర్శకుడు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌పై ఎం.ఎస్‌. రాజు నిర్మించారు. 2004 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఫుల్ ర‌న్‌లో ఏకంగా రు.19.2 కోట్లు రాబ‌ట్టింది.

Watch Adavi Ramudu (2004) (Telugu) Full Movie Online | Sun NXT
4) అడవి రాముడు :
ప్రభాస్, ఆర్తి అగర్వాల్ జంట‌గా న‌టించిన ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకుడు. చంటి అడ్డాల నిర్మాత‌. రూ.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో కేవ‌లం రూ.5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.
5) చక్రం :
ప్రభాస్, ఆశిన్‌, ఛార్మి హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకుడు. 2005 లో సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. రూ.9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగి రూ.5.7 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.
6) ఛత్రపతి :
ప్రభాస్, శ్రీయ జంట‌గా న‌టించిన ఈ సినిమాకు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడు. రూ.10.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రూ.16.35 కోట్ల షేర్ ను రాబట్టి.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

7) పౌర్ణమి :
ప్రభాస్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2006 లో సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యింది. యం.యస్.రాజు నిర్మాత. సూపర్ హిట్ కాంబో.. కావడంతో ఈ సినిమాకు రూ.12 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అయితే ఫుల్ రన్లో ఈ చిత్రం కేవలం రూ.6.7 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ అయ్యింది.

Prime Video: Yogi
8) యోగి :
ప్రభాస్, నయనతార జంటగా నటించిన ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకుడు. 2007లో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.18 కోట్ల వరకు షేర్ ను రాబట్టి.. క్లీన్ హిట్.
9) మున్నా :
ప్రభాస్, ఇలియానా జంట‌గా చేసిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్ రాజు నిర్మాత‌. రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రూ.13 కోట్ల వరకు షేర్ రాబట్టింది.
10) బుజ్జిగాడు :
ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ.19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే బాక్సాఫీస్ వద్ద రూ.15 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.

Billa (Telugu) (2009) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow
11) బిల్లా
ప్రభాస్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ.22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.19 కోట్ల షేర్ రాబట్టింది.
12) ఏక్ నిరంజన్ :
ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే బాక్సాఫీస్ వద్ద రూ.12.8 కోట్లు షేర్ రాబట్టింది.

Watch Darling (Telugu) (Telugu) Full Movie Online | Sun NXT

13) డార్లింగ్ :
ప్రభాస్ – కరుణాకరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ.16.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రూ.22.91 కోట్ల షేర్ రాబట్టింది.
14) మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ :
ప్రభాస్ – దశరథ్ రూ.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రూ.27.92 కోట్ల షేర్ రాబట్టింది.
15) రెబ‌ల్ :
ప్రభాస్ – లారెన్స్ కాంబినేషన్లో రూ.33 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రూ.27.3 కోట్ల షేర్ రాబట్టింది.

16) మిర్చి :
ప్రభాస్ – కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా.. రూ.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రూ.47.88 కోట్ల షేర్ రాబట్టింది.

Bahubali 1 The Beginning (2015) Full Movie In Hindi
17):17) బాహుబ‌లి 1 :
రూ.148 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.302.3 కోట్ల షేర్ రాబట్టింది.
18) బాహుబ‌లి 2 :
రూ.350 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఫుల్ రన్లో రూ.814.10 కోట్ల షేర్ రాబట్టింది.
19) సాహో :
రూ.290 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.232.60 కోట్ల షేర్ రాబట్టింది.

ప్రభాస్.. 'రాధేశ్యామ్' టీజర్ వచ్చేస్తోంది..! - The Leo News | Telugu News

20) రాధేశ్యామ్ :
రూ.200 కోట్ల ట…

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news